|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Peddi Song : చికిరి.. చికిరి.. పాటకు బామ్మా స్టెప్పులు అదుర్స్.. చరణ్ ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్..

Published: 02-12-2025, 6:10 AM
Peddi Song : చికిరి.. చికిరి.. పాటకు బామ్మా స్టెప్పులు అదుర్స్.. చరణ్ ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్..
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
  • బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ‘చికిరి.. చికిరి..’ సాంగ్ వైరల్ అయ్యింది.
  • తాజాగా ఓ బామ్మ ‘చికిరి.. చికిరి..’ పాటకు రామ్ చరణ్ తరహాలో స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.
  • ఈ బామ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చరణ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఫిదా చేసింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి.. చికిరి..’ సాంగ్ ఎంతగానో వైరల్ అవుతోంది. తాజాగా ఈ పాటకు ఓ బామ్మ అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ చరణ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.

పెద్ది సినిమాపై భారీ అంచనాలు

Peddi Song : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో పెద్ది సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, చికిరి.. చికిరి సాంగ్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నాల్కోన్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రహమాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు.(Peddi Song)

ఈ క్రమంలోనే ఇటీవల రిలీజయిన చికిరి.. చికిరి.. సాంగ్ బాగా వైరల్ అయింది. ఈ పాటకు రామ్ చరణ్ కూడా అదిరిపోయే స్టెప్ లు వేయడంతో ఫ్యాన్స్, రీల్స్ లో చరణ్ స్టెపును అందరూ తెగ ట్రై చేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ రామ్ చరణ్ చికిరి.. చికిరి.. సాంగ్ కి స్టెప్ వేయడం వైరల్ గా మారింది.

చికిరి.. చికిరి.. సాంగ్ ఎంత వైరల్ అయ్యిందంటే?

బామ్మ స్టెప్పులతో చరణ్ ఫ్యాన్స్ ఫిదా

ఓ ఫంక్షన్ లో ఓ బామ్మ చరణ్ చికిరి.. చికిరి.. పాటకు రామ చరణ్ వేసినట్లే స్టెప్స్ వేయడానికి ప్రయత్నించింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఫ్యాన్స్ బామ్మ చేసిన చరణ్ స్టెప్ ని వైరల్ చేస్తూ పాట ఓ రేంజ్ లో హిట్ అయింది, వయసుతో సంబంధం లేకుండా బామ్మ కూడా పాట ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు అదరగొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రిలీజ్ కి చాలా టైం ఉండగానే చరణ్ పెద్ది సినిమాకు బాగా హైప్ వస్తుంది అని భావిస్తున్నారు.

మొత్తానికి, ‘చికిరి.. చికిరి..’ సాంగ్ వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. సినిమా విడుదలకు ముందే ఈ పాట ‘పెద్ది’పై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది అనడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.