|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పితృదోషం: ఎన్ని తరాల వరకు, ఏ సమస్యలు?

Published: 16-09-2025, 10:56 AM
పితృదోషం: ఎన్ని తరాల వరకు, ఏ సమస్యలు?

పితృపక్షంలో పితృదేవతలను పూజించడం, తర్పణాలు, దానధర్మాలు చేయడం ఆచారం. పితృదోషం వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ కథనంలో పితృదోషం గురించి వివరంగా తెలుసుకుందాం.

Key Points

1

పితృదోషం మూడు నుండి ఏడు తరాల వరకు ప్రభావం చూపుతుంది.

2

తర్పణ, శ్రాద్ధ, పిండదానం చేయకపోవడం వల్ల పితృదోషం ఏర్పడుతుంది.

4

పితృదోష నివారణకు తగిన కర్మలు నిర్వహించడం అవసరం.

పితృదోషం అంటే ఏమిటి?

పితృపక్షం 15 రోజులు కూడా పితృదేవతల అనుగ్రహం కలగడానికి తర్పణాలు వదలడం, దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. పూర్వీకుల ఆత్మ కల్పించినట్లయితే పితృదోషం ఏర్పడుతుంది. ఎవరైనా చనిపోతే, చనిపోయిన తర్వాత తర్పణం, శ్రార్ధ, పిండ దానం సరిగ్గా చేయాలి. లేకపోతే పితృదోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ దోషమనేది వ్యక్తి కర్మ ప్రకారం ఏర్పడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి మంచి కర్మ ఉన్నట్లయితే పితృదోష ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా పితృదోషంతో ఇబ్బంది పడాల్సి వస్తే.. జీవితాంతం చాలా రకాల కష్టాలను ఎదుర్కోవాలి. రకరకాల సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. కనుక చనిపోయిన తర్వాత తర్పణం, శ్రార్ధ, పిండ దానం సరిగ్గా చేయాలి. పితృదోషం ఒక తరాన్ని మాత్రమే బాధ పెడుతుందా? ఎన్ని తరాల వరకు పితృదోషం వెంటాడుతూ ఉంటుంది? ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలు.

పితృదోషం ఒక తరాన్ని మాత్రమే బాధ పెడుతుందా?

పితృదోషం వల్ల ఏర్పడే సమస్యలు

మనం గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే, పితృ దోషం మూడు నుంచి ఏడు తరాల వరకు ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా తండ్రులు, తాతలు, ముత్తాతలకు బలంగా ఉంటుంది. కనుక వారు చనిపోయిన తర్వాత అన్ని ఆచారాలను సక్రమంగా పూర్తి చేయాలి.

మత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలుపుతున్నాయి. ఒకవేళ ఈ పితృదోషం పెరిగితే ఏడు తరాల వరకు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి చనిపోయిన వ్యక్తికి 15 రోజుల పాటు తగిన కర్మలు చేయాలి, లేదంటే పితృదోషంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

పితృదోషం కారణంగా ఎలాంటి సమస్యలు రావచ్చు?

పితృదోష నివారణ

చనిపోయిన తర్వాత పూర్వికులకు తర్పణం చేయని వ్యక్తులు పితృదోషంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి శ్రార్ధ, పిండదానం, తర్పణం చేయడం లాంటివి ముఖ్యమని మత గ్రంథాలు చెబుతున్నాయి. పితృదోషం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి.

వృత్తిలో నష్టం, పెళ్లి జరగక ఇబ్బంది పడడం, వివాహంలో సమస్యలు, ఆరోగ్యం సరిగా లేకపోవడం, వ్యాపారంలో ఆర్థిక నష్టం కలగడం, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావడం, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, ఎల్లప్పుడూ ఉద్రిక్త వాతావరణంతో బాధ పడడం వంటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పితృదోషం నుండి విముక్తి పొందడానికి, పూర్వీకులకు తగిన కర్మలు నిర్వహించడం చాలా ముఖ్యం. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.