|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘పాయిజన్ బేబీ’కి మిలియన్ వ్యూస్.. నెట్టింట దుమ్మురేపుతోన్న మలైకా, రష్మిక

Published: 15-10-2025, 1:33 PM
‘పాయిజన్ బేబీ’కి మిలియన్ వ్యూస్.. నెట్టింట దుమ్మురేపుతోన్న మలైకా, రష్మిక

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘థామా’ మూవీలోని ‘పాయిజన్ బేబీ’ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. మలైకా అరోరా, రష్మికల డ్యాన్స్ హైలైట్‌గా నిలుస్తోంది.

Key Points

1

రష్మిక, ఆయుష్మాన్ ఖురానా నటించిన 'థామా' మూవీలో 'పాయిజన్ బేబీ' స్పెషల్ సాంగ్.

2

ఈ సాంగ్ 24 గంటల్లో 19 మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

4

రష్మిక, మలైకా కాంబినేషన్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

‘థామా’ మూవీ ‘పాయిజన్ బేబీ’ సాంగ్ క్రేజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న మూవీ ‘థామా’. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో నాల్గవ భాగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. ‘పాయిజన్ బేబీ’ అంటూ సాగే ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతూ విడుదలైన 24 గంటల్లోనే 19 మిలియన్ పైగా వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. అంతే కాకుండా.. ఇందులో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ మలైకా అరోరా తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అందరికి ఆకట్టుకుంటుంది. అలాగే రష్మిక కూడా ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో రష్మిక, మలైకా కాంబో అదిరిపోయిందంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

Riddhi Kumar: ప్రభాస్ అలాంటి వ్యక్తి.. ఆ ఎక్స్‌పీరియన్స్ మాటల్లో చెప్పలేను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

మలైకా, రష్మికల డ్యాన్స్ హైలైట్స్

సోషల్ మీడియాలో ‘పాయిజన్ బేబీ’ రచ్చ

మొత్తంమీద, ‘పాయిజన్ బేబీ’ సాంగ్ ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా, మలైకా, రష్మికల కెమిస్ట్రీ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ పాట విజయం ‘థామా’ చిత్రానికి మంచి ప్రచారం కల్పిస్తోంది. మూవీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.