
📌 Key Points
- రష్మిక మందన్న పెళ్లి ఫోటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి.
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ విన్నింగ్ పోస్ట్ రికార్డును రష్మిక అధిగమించారు.
- విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి.
- సౌత్ ఇండియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. తన పెళ్లి ఫోటోలతో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ పొందిన భారతీయ పోస్ట్‌గా నిలిచారు.
రష్మిక సరికొత్త రికార్డు
Rashmika mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి ఏకంగా 23 మిలియన్ల లైక్స్ సాధించి భారత్‌లోనే అత్యధిక లైక్స్ పొందిన పోస్ట్‌గా రికార్డుకెక్కాయి. ఇప్పటివరకు క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ కప్ విన్నింగ్ పోస్ట్ రికార్డును రష్మిక అధిగమించడం విశేషం. వెండితెరపైనే కాదు, సోషల్ మీడియాలోనూ ఆమె క్రేజ్ మామూలుగా లేదని ఈ రికార్డ్ నిరూపించింది. ఆ వివరాలు చూద్దాం..
సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ టాప్ లో ఉండేవారు. ముఖ్యంగా T 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆయన పెట్టిన పోస్ట్‌కు 22.9 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన పోస్ట్‌గా అది ఇప్పటివరకు నిలిచింది. కానీ, విజయ్ దేవరకొండతో జరిగిన తన పెళ్లి ఫోటోలను రష్మిక పోస్ట్ చేయగానే అభిమానులు లైక్స్‌తో ముంచెత్తారు. పెళ్లి డ్రెస్ లో వున్నా ఈ జంట ఫొటోస్ క్షణాల్లోనే ఆ మార్కును దాటేసి, ఏకంగా 23 మిలియన్ల మార్కును చేరుకుని రష్మిక ఇన్‌స్టా క్వీన్‌గా అవతరించేలా చేసాయి. ఇక కోహ్లీ పేరిట ఉన్న ఐపీఎల్ విజయం (19.8M), రిటైర్మెంట్ పోస్ట్ (19.7M) రికార్డులు కూడా ఇప్పుడు రష్మిక జోరు ముందు వెలవెలబోతున్నాయి.
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రష్మిక
విరోష్ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు, ఆ వివాహ ఫోటోలు ఒక పండుగలా అనిపించాయి. అందుకే ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా, లైక్ల సునామీని సృష్టిస్తున్నాయి. సినిమా సెలబ్రిటీల పోస్ట్‌లకు ఇంత స్థాయిలో స్పందన రావడం ఇదే మొదటిసారి. ‘రణబాలి’ సినిమాలో విజయ్ పక్కన జయమ్మగా నటిస్తున్న రష్మిక, రియల్ లైఫ్‌లో పెళ్లికూతురిగా మెరిసిపోవడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ నుంచి సౌత్ వరకు అన్ని భాషల అభిమానులు ఈ పోస్ట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక రష్మిక కేవలం నటిగానే కాకుండా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ తన సత్తా చాటుతున్నారు. గతంలోనే సౌత్ ఇండియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిన రష్మిక, ఇప్పుడు ఏకంగా స్పోర్ట్స్ ఐకాన్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం ఆమె పాపులారిటీకి నిదర్శనం. ఇక వరుస పాన్ ఇండియా సినిమాలు, ఇప్పుడు ఈ పెళ్లి హడావిడి తో రష్మిక పేరు మార్మోగిపోతోంది. సెప్టెంబర్ 11న విడుదల కాబోతున్న ‘రణబాలి’ సినిమాకు ఈ సోషల్ మీడియా రికార్డ్ ఒక భారీ బూస్ట్‌లా పనికొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రికార్డును భవిష్యత్తులో మళ్ళి ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.
వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు
రష్మిక మందన్న సోషల్ మీడియాలో తన సత్తా చాటుతున్నారు. ఆమె క్రేజ్ ఏ విధంగా ఉందో ఈ రికార్డు నిరూపిస్తుంది. ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


