|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాళ్లు గ్లామర్‌ డాల్‌గానే చూస్తున్నారు: పూజా హెగ్డే

Published: 14-08-2025, 12:49 AM
వాళ్లు గ్లామర్‌ డాల్‌గానే చూస్తున్నారు: పూజా హెగ్డే

తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న పూజా హెగ్డే, తన కెరీర్‌లోని వివిధ అంశాల గురించి మాట్లాడారు. తెలుగులో హిట్ చిత్రాల తర్వాత ఫ్లాప్స్ ఎదుర్కొన్నప్పటికీ, కోలీవుడ్‌లో ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

Key Points

1

పూజా హెగ్డే పాన్ ఇండియా నటిగా రాణిస్తున్నారు.

2

తెలుగులో హిట్ల తర్వాత ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు.

4

బాలీవుడ్‌లో గ్లామర్ డాల్‌గా చూస్తున్నారని పేర్కొన్నారు.

పూజా హెగ్డే కెరీర్‌లో ఎదురుదెబ్బలు

పాన్‌ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి పూజాహెగ్డే. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే, ఈ అమ్మడికి క్రేజ్‌ తెచ్చిపెట్టింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమనే. ఇక్కడ వరుస పెట్టి  హిట్‌ చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నారు. దీంతో టాలీవుడ్‌లో మార్కెట్‌ డౌన్‌ అయిపోయింది. అయితే ఈ బ్యూటీని కోలీవుడ్‌ రెండోసారి అక్కున చేర్చుకుంది. 13 ఏళ్ల క్రితం ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదట్లోనే అపజయాన్ని మూటగట్టుకున్నారు.

కోలీవుడ్‌లో పునరాగమనం

ఆ తర్వాత విజయ్‌ సరసన బీస్ట్‌ చిత్రంలో నటించే అవకాశం రావడంతో సంబరపడ్డారు. అయితే ఆ చిత్రం కూడా పూర్తిగా నిరాశనే మిగిల్చింది. అయినప్పటికీ కోలీవుడ్‌ ఈమెను వదులుకోలేదు ఇటీవల సూర్యకు జంటగా రెట్రో చిత్రంలో నటించారు. ప్రస్తుతం మరోసారి విజయ్‌కు జంటగా జననాయకన్‌ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి రాఘవ లారెన్స్‌తో కాంచన–4 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మధ్యలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. విశేషమేమిటంటే పూజాహెగ్డే ఇప్పటివరకు నటించిన ఏ చిత్రానికి రానటువంటి పాపులారిటీ ఈ ఒక్క పాటకే రావడం. కూలీ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

బాలీవుడ్ అభిప్రాయం

అయితే, ఈ పాటను సరైన సమయంలో  ఉపయోగించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. అయితే, పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ప్రత్యేక పాటలో నటించడానికి అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కానీ, బాలీవుడ్‌లో తనను గ్లామర్‌డాల్‌గానే చూస్తున్నారన్నారని ఆమె చెప్పుకొచ్చారు. బహుశా తెలుగు, తమిళ చిత్రాల్లో తను నటించడం బాలీవుడ్‌ ప్రేక్షకులు చూసి ఉండరేమోనని అన్నారు.  దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు రెట్రో చిత్రంలో తనను రుక్మిణీ కథాపాత్ర గానే మార్చారన్నారు. తనలోని నటనా ప్రతిభను ఆయన నమ్మారని పూజాహెగ్డే పేర్కొన్నారు.

చివరగా, పూజా హెగ్డే తన కెరీర్‌లో ఎదుర్కొన్న అడ్డంకులు, కోలీవుడ్‌లోని విజయాలు, బాలీవుడ్‌లో తనకున్న ఇమేజ్ గురించి మాట్లాడారు. వివిధ భాషా చిత్రాలలో నటించడం ద్వారా ఆమె తన నటనను మెరుగుపరుచుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.