|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవర్ స్టార్ విధ్వంసం! ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో బాక్సాఫీస్ షేకింగ్! ట్విట్టర్ టాక్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 18-03-2026, 11:35 PM
పవర్ స్టార్ విధ్వంసం! 'ఉస్తాద్ భగత్ సింగ్'తో బాక్సాఫీస్ షేకింగ్! ట్విట్టర్ టాక్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ రీఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయ్, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు!
  • హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ అభిమానులకు కన్నుల విందు చేసింది.
  • శ్రీలీల డాన్సులు, రాశీఖన్నా ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
  • దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ఊపు ఊపేస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఉగాది కానుకగా విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అభిమానులకు కన్నుల పండుగలా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

పవన్ కళ్యాణ్ మాస్ జాతర షురూ!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ ఏమైతే ఆశించారో, దానికి రెట్టింపు వినోదాన్ని అందిస్తూ నేడు ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి, ఇక ఆ అంచనాలను ఈ సినిమా ఏమాత్రం తగ్గకుండా రీచ్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన మార్క్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో థియేటర్లను హోరెత్తించారు. ముఖ్యంగా పోలీస్ గెటప్‌లో పవన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హరీష్ శంకర్ రాసిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా తమ అందం, నటనతో మెప్పించారు.

శ్రీలీల డాన్సులు, రాశీఖన్నా ఎమోషనల్ సీన్స్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. ఇక ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. “పవన్ ఈజ్ బ్యాక్.. అసలైన మాస్ జాతర ఇది” అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ధురంధర్-2’ వంటి పెద్ద సినిమాతో పోటీ ఉన్నప్పటికీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వన్ సైడ్ వార్ అన్నట్లుగా థియేటర్స్‌లో దూసుకుపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఫైట్స్ సినిమాకే హైలైట్ అని రివ్యూలు వస్తున్నాయి. కొంత బోరింగా ఉన్నప్పటికీ.. పవన్ డైలాగ్స్‌తో అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఉగాది కానుకగా తన అభిమానులకు ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారరి చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొత్తానికి 3.5 రేటింగ్‌తో బాక్సాఫీసును షేక్ చేస్తోంది.

ట్విట్టర్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూలు

దేవిశ్రీ మ్యూజిక్‌తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి!

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇది ఫ్యాన్స్‌కు పండగలాంటి సినిమా. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.