
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఒకప్పుడు ఓ దర్శకుడు సినిమా ఛాన్స్ ని వదులుకున్నాడట! 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన వెనుక కథేంటో తెలుసుకుందాం. కన్నడ సూపర్ హిట్ సినిమా ‘జోగి’ రీమేక్ ‘యోగి’ సినిమాతో సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయం ఇది.
Key Points
ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శకుడు ప్రేమ్ కి అవకాశం వచ్చింది.
కన్నడ సినిమా ‘జోగి’ తెలుగు రీమేక్ ‘యోగి’కి దర్శకత్వం వహించమని ఆఫర్ వచ్చింది.
తెలుగు భాష రాకపోవడం వల్ల ఆ అవకాశాన్ని ప్రేమ్ వదులుకున్నారు.
నెటిజన్లు ప్రేమ్ నిర్ణయంపై వివిధ రకాలైన కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ కి వచ్చిన అరుదైన అవకాశం
Prabhas : ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండియా అంతా దర్శకులు క్యూ కడుతాయారు. కానీ ఓ దర్శకుడికి ప్రభాస్ తో సినిమా ఛాన్స్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా వద్దనుకుని వదిలేసాడంట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు, అది ఏ సినిమానో తెలుసా? అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు 20 ఏళ్ళ క్రితం సంగతి.
ప్రభాస్ 2007లో యోగి సినిమా చేసిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ సినిమా జోగి కి రీమేక్ గా తెరకెక్కింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో జోగి సినిమా తెరకెక్కినది. జోగి హిట్ అవ్వడంతో ఆ రైట్స్ కొని ఆ సినిమాని ప్రభాస్ తో డైరెక్ట్ చేయమని ప్రేమ్ కి ఆఫర్ ఇచ్చారంట.
ప్రేమ్ నిర్ణయం వెనుక కారణం
తాజాగా డైరెక్టర్ ప్రేమ్ తన KD సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి హైదరాబాద్ కి రాగా దీనిపై మాట్లాడుతూ.. ప్రభాస్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది కానీ చేయలేకపోయాను. కన్నడలో నేను జోగి అనే సినిమా తీసాను. అది ఇక్కడ యోగి గా తీసారు. ఆ సినిమాను నన్ను డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ నాకు తెలుగు రాదు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల సినిమా డైరెక్షన్ కి నో చెప్పాను. రైట్స్ ఇచ్చి వేరే వాళ్లతో చేయించుకోమని చెప్పాను అని తెలిపాడు.
నెటిజన్ల ప్రతిస్పందన
దీంతో పలువురు నెటిజన్లు లాంగ్వేజ్ రాకపోతే అసిస్టెంట్స్ ని పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు కదా, ప్రభాస్ తో సినిమా మిస్ అయ్యారు అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
చివరగా, ప్రేమ్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. భాషా సమస్య అనేది సృజనాత్మకతకు అడ్డురాదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

