|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్ర‌భాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌… ది రాజా సాబ్ నుంచి స్పెషల్ పోస్టర్

Published: 11-11-2025, 10:04 PM
ప్ర‌భాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌... ది రాజా సాబ్ నుంచి స్పెషల్ పోస్టర్

ప్రభాస్ అభిమానులకు శుభవార్త! ప్రభాస్ తన కెరీర్‌లో 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి అద్భుతమైన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి సందడి చేయనుంది.

Key Points

1

ప్రభాస్ కెరీర్‌లో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

2

'ది రాజా సాబ్' సినిమా నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ విడుదల.

4

మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్.

ప్రభాస్ స్టైలిష్ లుక్

ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ది రాజాసాబ్ ( The Raja Saab) సినిమా నుంచి ప్రభాస్ ( Prabhas) సూపర్ లుక్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. చిత్ర పరిశ్రమలో ప్రభాస్ 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రం బృందం.

ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. రజినీకాంత్ తరహాలో నోట్లో చుట్ట పెట్టుకొని చాలా డిఫరెంట్ గా కనిపించారు. ఇక ప్రభాస్ వెనకాల ఓ గ్యాంగ్ కూడా క‌నిపిస్తోంది. ఆ బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే, సాంగ్ లో ఓ షాట్ కు సంబంధించిన పోస్టర్ గా అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన ఈ రాజా సాబ్ సినిమాను మారుతి గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. సంక్రాంతి కానుకగా అంటే జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ది రాజా సాబ్ రిలీజ్ ఎప్పుడు?

మారుతి దర్శకత్వంలో రాజా సాబ్

మొత్తంగా, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. అతని 23 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా వచ్చిన ఈ లుక్ సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.