
📌 Key Points
- మారుతి ఇంటికి 100+ ఫుడ్ ఆర్డర్లు పెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. దర్శకుడికి షాక్!
- రాజాసాబ్ సినిమా ఫ్లాప్ కావడంతో మారుతిపై అభిమానుల ఆగ్రహం వ్యక్తం!
- స్విగ్గీ, జొమాటోల నుండి వరుస ఆర్డర్లతో విల్లా సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది!
- ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని, భయంతో వణుకుతున్న దర్శకులు!
టాలీవుడ్ లో సంచలనం! ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతికి ఊహించని షాక్ ఇచ్చారు. రాజాసాబ్ సినిమా ఫలితంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అభిమానులు ఏకంగా ఫుడ్ డెలివరీలతో దర్శకుడి ఇంటిని ముంచెత్తారు. అసలేం జరిగిందో తెలుసుకోండి!
మారుతికి ఫుడ్ ఆర్డర్స్ వరద
డైరెక్టర్ మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరో పిలిచి అవకాశం ఇస్తే ఫ్లాప్ సినిమా ఇచ్చాడని మండిపడుతున్నారు. మారుతి మోసం చేశాడని సోషల్ మీడియాలో ఆయనపై నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా తాజాగా మారుతి ఇంటికి ఏకంగా 100కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లు పెట్టారు. మారుతి కొండాపూర్ కొల్ల లగ్జరీ విల్లాలో నివాసం ఉంటుండగా అభిమానులు ఆయన నివాసానికి ఆర్డర్స్ పెడుతున్నారు.
స్విగ్గీ, జొమాటా నుండి వరుసగా ఆర్డర్లు రావడంతో సెక్యురిటీ సిబ్బంది షాక్ అయ్యారు. విషయం మారుతికి చెప్పడంతో తాను ఎలాంటి ఆర్డర్స్ పెట్టలేదని వచ్చివారిని వెనక్కి పంపించాలని చెప్పారు. దీంతో ఫుడ్ ఆర్డర్ల వ్యవహారం సెక్యురిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే అభిమానుల తీరు దర్శకులను భయాందోళనకు గురి చేస్తోంది. కేవలం మారుతి విషయంలోనే కాకుండా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లకు గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో స్టార్ హీరోలతో సినిమా అంటేనే దర్శకులు వణుకుతున్నారు.
రాజాసాబ్ ఫలితమే కారణమా?
దర్శకులపై ఫ్యాన్స్ ఆగ్రహం!
ప్రస్తుతం ఈ సంఘటన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మారుతికి మద్దతుగా నిలుస్తున్న వారు కొందరైతే, ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పనిని సమర్ధిస్తున్నారు మరికొందరు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


