
📌 Key Points
- మన శంకర వర ప్రసాద్ గారు 19 రోజుల్లో రూ. 284 కోట్ల వసూళ్లు రాబట్టింది, ఇది ఒక సంచలనం!
- తెలుగు రాష్ట్రాల్లో రూ. 203 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో చిరంజీవి సరికొత్త రికార్డు సృష్టించారు.
- ఈ సినిమా ‘హనుమాన్’ రికార్డును బద్దలు కొట్టి, నెంబర్ 1 స్థానానికి చేరుకుంది.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు చూద్దాం.
19 రోజుల్లో మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల విధ్వంసం!
చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. రీజనల్ ఫిల్మ్ లో ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. లేటెస్ట్ గా 19వ రోజు కూడా సత్తా చాటింది. శుక్రవారం ఈ మూవీకి కోటికి పైగా వసూళ్లు రావడం విశేషం. సినిమా క్లోజింగ్‌కి చేరుకున్నా కలెక్షన్లు ఫర్వాలేదనిపించేలా ఉండటం విశేషం.
`మన శంకర వర ప్రసాద్ గారు` మూవీకి సంబంధించి సాక్నిల్క్ సైట్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ మూవీకి రూ.284కోట్లు వచ్చాయి. ఇండియాలో రూ.203కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. రూ.240కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ.203కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. దీంతో ఈ మూవీ టాప్ గ్రాసర్స్ లో 8వ స్థానంలో నిలిచింది. `హనుమాన్` రికార్డుని బ్రేక్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రీజనల్ ఫిల్మ్స్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. టాప్‌లో `పుష్ప 2`(రూ.1234) కోట్లతో మొదటి స్థానంలో ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్` (రూ.782 కోట్లతో) రెండో స్థానంలో ఉంది. `కల్కి 2898 ఏడీ`(రూ.646కోట్లతో) మూడో స్థానంలో నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఊచకోత!
ఆ తర్వాత `సలార్` మూవీ (రూ.406)కోట్లతో నాల్గో స్థానంలో, `బాహుబలి 2`(రూ.300)కోట్లతో ఐదో స్థానంలో ఉంటే, `దేవర`(రూ.292)కోట్లతో ఆరో స్థానంలో ఉంది. `పుష్ప`(రూ.267కోట్లతో) ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాత రూ.203కోట్లతో `మన శంకర వర ప్రసాద్ గారు` ఎనిమిదవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత `హనుమాన్`(రూ.201 కోట్లతో) 9వ స్థానంలో, `ఓజీ`(రూ.194)కోట్లతో పదో స్థానంలో నిలిచింది. రీజనల్ ఫిల్మ్ లో చిరంజీవితో ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి రూ.55కోట్ల వరకు లాభాలు గడించిందని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీ సుమారు రూ.370కోట్ల వరకు రాబట్టిందని చిత్ర బృందం చెబుతోంది.
రికార్డులు బద్దలు కొట్టిన మన శంకర వర ప్రసాద్ గారు!
ఇక చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. క్లైమాక్స్ లో వచ్చి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మంచి ఫ్యామిలీ మూవీ కావడం, కామెడీ వర్కౌట్ కావడం, మహిళలకు సంబంధించిన అంశాలుండటం, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులకు సంబంధించిన అంశాలు ఉండటం ఆకట్టుకుంది. అదే సమయంలో పిల్లలకు సంబంధించిన సీన్లు కూడా మేళవించడం విశేషం. ఇలా అన్ని వర్గాలు చూసేలా మంచి ఫ్యామిలీ ప్యాక్ మూవీని తయారు చేశారు అనిల్ రావిపూడి. దానికి చిరంజీవి తనదైన టేస్ట్ ని యాడ్ చేశారు. దీంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీని సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన విషయం తెలిసిందే.
చిరంజీవి గారి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా మరిన్ని రికార్డులు కొల్లగొట్టాలని ఆశిద్దాం.


