
📌 Key Points
- ప్రభాస్ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు: ఫౌజీ, స్పిరిట్.
- రాజా సాబ్ ఆలస్యం కావడంతో ప్రభాస్ షెడ్యూల్స్‌లో మార్పులు, ఫౌజీపై ప్రభావం.
- స్పిరిట్ విడుదల తేదీ ప్రకటించగా, ఫౌజీ విడుదలపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన.
- ఫౌజీ సినిమా 2028కి వాయిదా పడే అవకాశం ఉందని ఊహాగానాలు.
ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, రాజా సాబ్ సినిమా ఆలస్యం కావడంతో ఫౌజీ సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. దీనికితోడు స్పిరిట్ విడుదల తేదీ ప్రకటించడంతో గందరగోళం ఏర్పడింది.
ప్రభాస్ సినిమాల షెడ్యూల్ గందరగోళం
Prabhas Upcoming Movie: ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి రెండు భారీ సినిమాలపై పని చేస్తున్నారు. ఒకటి ఫౌజీ.. మరొకటి స్పిరిట్. రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. బారీ బడ్జెట్..బారీ అంచనాలు ఉండటంతో ఈ రెండు సినిమాలు ప్రభాస్‌కు అవకాశంగా ఉండటంతో పాటు సమస్యగా కూడా మారుతున్నాయి.
ముందుగా రాజా సాబ్ సినిమా ఆలస్యం కావడంతో ప్రభాస్ షెడ్యూల్స్ గందరగోళంగా మారాయి. దాని ప్రభావం ఫౌజీ సినిమా మీద కూడా పడింది. అనుకున్న టైమ్‌కు షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు రాజా సాబ్ విడుదల అయ్యి ఫలితం తెలిసిన తర్వాత అందరి దృష్టి స్పిరిట్ మీద పడింది.
ఇటీవల స్పిరిట్ విడుదల తేదీ ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఎక్కువ కాలం కాకముందే 2027 మార్చి 5న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తైన ఫౌజీకి మాత్రం ఇంకా విడుదల తేదీ చెప్పలేదు. వాయిదా వేస్తున్నామని కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీనితో ఫౌజీ భవిష్యత్తుపై స్పష్టత లేకుండా పోయింది.
ఫౌజీ విడుదలపై సందిగ్ధత
వచ్చిన సమాచారం ప్రకారం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ స్పిరిట్ మీదే పూర్తిగా ఫోకస్ చేయాలని కోరుతున్నారట. స్పిరిట్‌లో ప్రభాస్ లుక్ పూర్తిగా భిన్నంగా ఉండటంతో ఒకేసారి రెండు సినిమాలు చేయడం కష్టం అవుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే ఫౌజీ షూటింగ్ మరింత ఆలస్యం కావచ్చు.
ఇప్పటికే అభిమానులు గందరగోళంలో ఉన్నారు. ఫౌజీ టీమ్ ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ అందుకు ప్రభాస్ డేట్స్ కీలకం. ఆయన నుంచి పూర్తి సహకారం లభిస్తేనే ప్లాన్ ముందుకు వెళ్తుంది. కొన్ని రూమర్స్ ప్రకారం ఫౌజీ సినిమా 2028కి వెళ్లొచ్చని అంటున్నారు. ఇది కాస్త అతిశయోక్తిగా అనిపిస్తున్నా పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. ఈ సినిమా ఇప్పటికే మొదలయ్యి దాదాపు ఒక సంవత్సరం పైనే అవుతుంది. ఇక ఇది నిజమే అయితే.. ఈ సినిమా షూటింగ్ నుంచి విడుదల తేదీకి మధ్య ఏకంగా.. నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టు ఉంటుంది.
బాహుబలి సినిమా కూడా ప్రభాస్కి ఐదేళ్లు పట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు హను రాఘవపూడి చిత్రం కూడా అదే ఐదేళ్లు పడేలా ఉంది. ఇదిలా ఉంటే మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న.సలార్ 2 .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2 టీమ్‌లు కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక వీటికి కూడా ప్రభాస్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
2028లో ఫౌజీ విడుదల?
ప్రభాస్ మాత్రం అన్నిటికన్నా ముందు సందీప్ రెడ్డి వంగ.. స్పిరిట్ సినిమాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అర్థమవుతోంది. మరి ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి విషయం అందిస్తుందో వేచి చూడాలి.
ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఫౌజీ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆశిద్దాం. ఒకవేళ ఆలస్యమైతే మాత్రం నిరాశ తప్పదు.


