|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే.. ‘ఫౌజీ’ దసరా రిలీజ్! రికార్డులు బద్దలు ఖాయం!!

Published: 29-01-2026, 7:05 AM
ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'ఫౌజీ' దసరా రిలీజ్! రికార్డులు బద్దలు ఖాయం!!
  • ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైం ఆర్మీ మ్యాన్ గా కనిపించనుండటం విశేషం.
  • 2026 దసరాకి ‘ఫౌజీ’ సినిమా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది నిజంగా అభిమానులకు పండగే!
  • ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఫౌజీ’, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.
  • ఆగస్టు 15న టీజర్ విడుదల, రిలీజ్ డేట్ ప్రకటన ఉంటుందని సమాచారం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న ‘ఫౌజీ’ సినిమా గురించి ఒక అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా దసరాకి విడుదల కానుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ: దసరా రిలీజ్?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ లైనప్ చూస్తే మతి పోవడం ఖాయం. క్రేజ్ సినిమాలను, డైరెక్టర్ లను లైన్లో పెట్టాడు ఈ స్టార్. వాటిలో దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్న సినిమా ఒకటి. అదే ఫౌజీ. ఇండియన్ ఆర్మీ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. సీతా రామం లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు హను రాఘవపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫౌజీ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ప్రభాస్(Prabhas) కెరీర్ లో ఫస్ట్ టైం ఆర్మీ మ్యాన్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమా విడుదల కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, మేకర్స్ మాత్రం ఈ సినిమా విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. అయితే, తాజాగా ఇండస్ట్రీ నుంచి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్మీ మ్యాన్ గా ప్రభాస్ అదరగొట్టేందుకు సిద్ధం!

అదేంటంటే, ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ఫౌజీ’ సినిమాను 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఫౌజీ సినిమా షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయ్యిందట. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టారట మేకర్స్. ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా ఇప్పటికే మొదలవడంతో త్వరలోనే సినిమా పూర్తయ్యే అవకాశం ఉందట.

‘ఫౌజీ’ షూటింగ్ అప్డేట్స్: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

కాబట్టి, మేకర్స్ ముందుగా అనుకున్నట్టుగానే 2026 దసరాకి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలని పక్కా ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఈ విషయం గురించి జనవరి 26న ఒక అప్డేట్ వస్తుంది అని అనుకున్నారు అంతా కానీ రాలేదు. ఆగస్టు 15వ తేదీన టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా దసరాకి విడుదలవుతుందనే వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.