
📌 Key Points
- ప్రభాస్ కి విజయవాడ పునుగులంటే చాలా ఇష్టమని స్వయంగా వెల్లడించారు.
- విజయవాడ వెళ్ళిన ప్రతిసారి పునుగులు తినేవాడినని ప్రభాస్ తెలిపారు.
- ప్రభాస్ తన ఆతిథ్యంతో అందరినీ ఆకట్టుకుంటారని చాలా మంది సెలబ్రిటీలు చెప్పారు.
- సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను ప్రభాస్ మెచ్చుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విజయవాడ పునుగులంటే తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన విజయవాడ వెళ్ళినప్పుడు తప్పకుండా వాటిని తినేవాడినని అన్నారు. అంతేకాకుండా, సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను కూడా ఆయన మెచ్చుకున్నారు.
ప్రభాస్ కి ఇష్టమైన స్నాక్ ఏది?
Prabhas: ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రతి ఏడాది కనీసం ఒకటి లేదా రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉండే ప్రభాస్ బయట కనపడటానికి పెద్దగా ఇష్టపడరు. అయితే తాజాగా ఈయన యు వి క్రియేషన్ బ్యానర్ లో సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ (couple Friendly)సినిమా బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే నటుడు సంతోష్ శోభన్ ప్రభాస్ ను ప్రశ్నిస్తూ అన్న విజయవాడ పునుగులంటే మీకు ఇష్టమా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ విజయవాడలో దొరికే పునుగులు ఆల్ టైం మై ఫేవరెట్ స్నాక్స్ అంటూ తెలియజేశారు ఎప్పుడు విజయవాడ వచ్చిన తప్పకుండా పునుగులు తిని వెళ్లే వాళ్ళమని కానీ ఈ మధ్యకాలంలో తినలేక పోతున్నానంటూ తెలియచేశారు. విజయవాడలో దొరికే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయని తనకు చాలా ఇష్టం అనే విషయాన్ని ప్రభాస్ తెలిపారు. ఇప్పుడు కూడా తాను ఈ పునుగుల గురించి మాట్లాడుతుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయని ఈయన తనకు ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఐటమ్ గురించి తెలిపారు.
విజయవాడ పునుగుల గురించి ప్రభాస్ ఏమన్నారు?
ప్రభాస్ అంటేనే ఫుడ్. ఈయన ఫుడ్ బాగా తినడమే కాకుండా తన చుట్టూ ఉన్నవారికి కూడా అదే రేంజ్ లో ఫుడ్ పెడుతూ ఫుడ్ తోనే చంపేస్తుంటారు. ఇలా అతిథి మర్యాదలకు ప్రభాస్ పెట్టింది పేరని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంతో గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఫుడ్ లవర్ అయిన ప్రభాస్ విదేశాలకు సంబంధించిన ఫుడ్ కాకుండా విజయవాడలో దొరికే పునుగులు అంటే ఇష్టం అని చెప్పడం విశేషం.
కపుల్ ఫ్రెండ్లీ పై ప్రభాస్ ప్రశంసలు..
‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాపై ప్రభాస్ రివ్యూ
ఇక విజయవాడలో పునుగులకు ఫేమస్ అనే సంగతి మనకు తెలిసినదే. ఇలా ప్రతి ఒక్క ఊరు ఒక్కో ఫుడ్ ఐటమ్ కు ఫేమస్ అంటూ ప్రభాస్ తెలియజేశారు. ఇక కపుల్ ఫ్రెండ్లీ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ప్రభాస్ తో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు నైట్ షూట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా చూశానని, ఈ సినిమా చూసిన తర్వాత నేను సినిమా నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. చాలా అద్భుతంగా ఉందని, ఈ సినిమా నేను మరో నాలుగైదు సార్లు ఈజీగా చూసేస్తాను అంటూ సినిమా గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ విజయవాడ పునుగుల గురించి చెప్పిన విషయాలు ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించాయి. ఆయన సాధారణ ఆహారపు అలవాట్లను కూడా ఇష్టపడతారని ఇది చూపిస్తుంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమాను మెచ్చుకోవడం విశేషం.


