|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మమతా మోహన్ దాస్‌కు షాక్ ఇచ్చిన హీరో ఎవరు? నమ్మించి మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు!

Published: 15-02-2026, 1:05 AM
మమతా మోహన్ దాస్‌కు షాక్ ఇచ్చిన హీరో ఎవరు? నమ్మించి మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు!
  • మమతా మోహన్ దాస్‌ను ఓ హీరో నిశ్చితార్థం దాచి మోసం చేశాడని వెల్లడి
  • క్యాన్సర్ నుండి కోలుకున్న తరువాత డేటింగ్ ప్రతిపాదన వచ్చిందని తెలిపిన మమత
  • భర్తతో విడాకుల గురించి కూడా మాట్లాడిన మమతా మోహన్ దాస్
  • రెండుసార్లు క్యాన్సర్ బారిన పడి తిరిగి ఆరోగ్యంగా వచ్చిన మమత

ప్రముఖ హీరోయిన్ మమతా మోహన్ దాస్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడారు. ఒక హీరో తనను నిశ్చితార్థం దాచి మోసం చేశాడని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా, తన క్యాన్సర్ పోరాటం గురించి కూడా ఆమె మాట్లాడారు.

డేటింగ్ పేరుతో మోసం చేసిన హీరో!

Mamatha Mohandas: ప్రముఖ హీరోయిన్ మమతా మోహన్ దాస్ (Mamatha Mohan Das) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు సినీ జీవితంలో ఇటు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ ధైర్యంగా గట్టి కంబ్యాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితంపై ఊహించని కామెంట్లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ క్రమంలోనే నిశ్చితార్థం జరిగిన విషయాన్ని దాచిపెట్టి తనతో డేటింగ్ చేశారు ఆ హీరో అని ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి మమతా మోహన్ దాస్ ని మోసం చేసిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

మయూక్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మమత మోహన్ దాస్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత హోమం , విక్టరీ, చింతకాయల రవి , కింగ్, కేడి అంటూ పలు చిత్రాలలో నటించి కెరియర్ ఫామ్ లో ఉండగానే క్యాన్సర్ బారిన పడింది.. దాదాపు రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచింది ఈ ముద్దుగుమ్మ. క్యాన్సర్ నుండి బయటపడిన ఈమె ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నాకు డేటింగ్, ప్రేమలో పెద్దగా అనుభవం లేదు. క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఒక మహిళగా నా అంచనాలను నేను నెరవేర్చుకోవాలనుకున్నాను.

క్యాన్సర్ పోరాటం, వ్యక్తిగత జీవితంపై మమత కామెంట్స్

అయితే ఆ సమయంలో ఒక ప్రముఖ మలయాళ నటుడు నన్ను డేటింగ్ కోసం అడిగాడు. అందుకు నా తల్లి కూడా నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అతడికి అప్పటికే ఇంకో మహిళతో నిశ్చితార్థం జరిగింది . ఈ విషయాన్ని అతడు నా దగ్గర దాచి పెట్టి మోసం చేశారు. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. నా జీవితంలో మరో వ్యక్తిని కలుసుకున్నాను. కానీ ఈ ప్రేమ డేటింగ్ అనవసరమని అన్నాడు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇకపోతే తన భర్త ప్రజీత్ గురించి మాట్లాడుతూ..” నేను, నా భర్త ఒకరికొకరం అతని సోదరి వివాహంలో కలిశాము. ఇక మాలో ఒకరి గురించి ఒకరు చర్చించుకున్నాము. ఆ తర్వాతే అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. మా వివాహం చాలా సింపుల్గా జరిగిపోయింది. కానీ ఆరు నెలలకే ఆ బంధం నుంచి బయటకు వచ్చాను. అది చాలా కఠినమైన నిర్ణయం. కానీ నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.. ఏది ఏమైనా కెరియర్ పీక్స్ లో ఉండగానే రెండుసార్లు క్యాన్సర్ బారిన పడి మళ్లీ ఇప్పుడు ఆరోగ్యంగా బయటపడింది మమతా మోహన్ దాస్.

విడాకుల గురించి మమత చెప్పిన మాటలు

ఏది ఏమైనా ఒకవైపు క్యాన్సర్.. మరొకవైపు వ్యక్తిగత కారణాలవల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ సినిమాలలో బిజీ కావాలని వరుస అవకాశాలు అందుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి మునుపటి మమతా దాస్ కి ఇప్పుడు ఎలాంటి అవకాశాలు అందుతాయేమో చూడాలి.

మొత్తానికి మమతా మోహన్ దాస్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకొని, వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలను ఎదుర్కొంటూ ఆమె ముందుకు సాగుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.