|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హ్యాండ్‌సమ్ లుక్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వింటేజ్ రెబెల్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

Published: 02-07-2025, 3:21 AM
హ్యాండ్‌సమ్ లుక్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వింటేజ్ రెబెల్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. తాజాగా ప్రభాస్ ఓ అభిమానితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ప్రభాస్ హ్యాండ్‌సమ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

Key Points

1

ప్రభాస్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్

2

ఫౌజీ సినిమా షూటింగ్ సెట్ లోని ఫోటో

4

వింటేజ్ రెబెల్ లుక్‌తో ప్రభాస్ రీ ఎంట్రీ

ప్రభాస్ కొత్త లుక్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ఫౌజీ’(Fouji) ఒకటి. దీనికి దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో డార్లింగ్ సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వీ(Imanvi) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ క్రమంలో తాజాగా మన డార్లింగ్‌ కొత్త లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫౌజీ షూటింగ్ సెట్‌లో ప్రభాస్ ఓ అభిమానితో ఫొటో దిగగా అది కాస్త వైరల్‌గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి లుక్ రాలేదని, ప్రభాస్ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వింటేజ్ రెబల్ ఈజ్ బ్యాక్ అని పోస్టులు పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రభాస్ లేటెస్ట్ లుక్‌ని చూసేయండి.

ఫౌజీ సినిమా అప్డేట్స్

అభిమానుల స్పందన

ప్రభాస్ తన కొత్త లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఫౌజీ సినిమాపై అంచనాలు పెరిగాయి. వింటేజ్ రెబెల్ లుక్ ప్రభాస్ అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.