|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2026లో టాలీవుడ్‌లో వెయ్యి కోట్ల సునామీ: ఏ స్టార్ హీరో సృష్టిస్తారు? పోటీ రసవత్తరం!

Published: 16-12-2025, 3:24 AM
2026లో టాలీవుడ్‌లో వెయ్యి కోట్ల సునామీ: ఏ స్టార్ హీరో సృష్టిస్తారు? పోటీ రసవత్తరం!
  • గతంలో 500 కోట్లు పెద్ద హిట్టయితే ఇప్పుడు వెయ్యి కోట్లు సాధారణమైంది.
  • బాహుబలి, RRR, పుష్ప 2, కల్కి వంటి చిత్రాలు ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ దాటాయి.
  • 2025లో టాలీవుడ్ అంచనాలకు తగ్గ వసూళ్లు సాధించలేకపోయింది.
  • 2026లో ప్రభాస్ ‘రాజా సాబ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్‌లో వెయ్యి కోట్ల కలెక్షన్లు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఈ ట్రెండ్ కొనసాగుతూ, 2026లో మరిన్ని సినిమాలు ఈ మైలురాయిని చేరుకోవచ్చని అంచనా. రాబోయే ఏడాది స్టార్ హీరోల మధ్య రసవత్తరమైన పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఏ చిత్రాలు వెయ్యి కోట్లు కొట్టి, ఏ హీరో విజేతగా నిలుస్తారో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

టాలీవుడ్‌లో వెయ్యి కోట్ల ట్రెండ్: ఎక్కడ మొదలైంది?

Tollywood Movies :  అప్పుడు స్టార్ హీరోల సినిమాలు 500 కోట్లు వసూలు చేశాయంటే బిగ్గెస్ట్ హిట్టుగా పరిగణించేవారు. కానీ ఈ మధ్య 1000 కోట్లు రాబట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప 2,కల్కి లాంటి చిత్రాలు 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఒకప్పుడు కేవలం 100 కోట్లు క్రాస్ చేస్తే ఆ సినిమా హిట్ అని టాక్ వినిపించేది. కానీ ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో 2వేల కోట్లకు పైగా వసూళ్లను టార్గెట్ గా పెట్టుకుంటున్నాయి సినిమాలు. ప్రస్తుతం తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా 2వేల కోట్ల క్లబ్ లోకి చేరిపోయే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది 500 కోట్లకు మించి ఒక్క సినిమాలు లేదు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి వచ్చే ఏడాదిలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించబోతున్న సినిమాలు.. ఏ స్టార్ హీరోల మధ్య పోటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

2025 లో టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలు చప్పగానే ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ భారీ అంచనాలతో వచ్చి బోల్తా పడింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని అందుకున్న కూడా కేవలం 400 కోట్ల లోపే వసూళ్లను అందుకుంది. ఆ తర్వాత ఏ సినిమా కూడా 500 కోట్లను మించి రాబట్టలేదు. కానీ 2026 సంక్రాంతికి మాత్రం బోలెడు సినిమాలో పోటీ పడుతున్నాయి. ఆ ఏడాదిలో పాన్ ఇండియా హీరోలు పోటీ పడుతున్నారు. ముందుగా పాన్ ఇండియా హీరో ప్రభాస్, మారుతి డైరెక్షన్ లో రాబోతున్న రాజా సాబ్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.. కల్కి తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న `పెద్ది`పై అంచనాలున్నాయి. మార్చిలో ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది.. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు..

2025లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి?

2026లో భారీ అంచనాలతో వస్తున్న పాన్ ఇండియా చిత్రాలు

గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మరో భారీ ప్రాజెక్టు పెద్ది. గతంలో ఎన్నడు కనిపించని మాస్ లుక్ లో రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. దాంతో ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ నటిస్తోన్న `పౌజీ` కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తో న్న చిత్రమిది. ఈ సినిమాపై ఇండియా వైడ్ భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ది మించి ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి..`సీతారామం` లాంటి పాన్ ఇండియా సక్సెస్ కూడా హను ఖాతాలో ఉన్న నేపథ్యంలో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా సరే నార్త్ లో 200 కోట్లు వసూలు చేస్తే చాలు కచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయినట్లే.. మరి ఏ సినిమా వచ్చేయడాది 1000 కోట్లను మించి వసూళ్లను రాబడుతుందో చూడాలి..

మొత్తంగా, 2026 టాలీవుడ్ సినీ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు భారీ అంచనాలతో వస్తూ, వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడానికి పోటీ పడనున్నాయి. ఈ పోటీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.