
ప్రభాస్ అభిమానులకు శుభవార్త! నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న కొత్త సినిమా టైటిల్‌ను ‘ఫౌజీ’గా ప్రకటించారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Key Points
ప్రభాస్ పుట్టినరోజున హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న కొత్త సినిమా 'ఫౌజీ' టైటిల్ ప్రకటన.
ఇది 1930వ దశకం నేపథ్యంగా సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు; ఇందులో ఇమాన్వి కథానాయిక.
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టైటిల్ ‘ఫౌజీ’ ప్రకటన
ప్రభాస్, హను రాఘవపూడి (Hanu Raghavapudi) కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు. నేడు (అక్టోబర్ 23) డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ మూవీకి “ఫౌజీ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. 1930వ దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా వాటికి కొంత ఫిక్షన్ జోడించి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇందులో కొత్త భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఫౌజీ: కథా నేపథ్యం, నటీనటులు
మన చరిత్రలోని దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు. ప్రభాస్‌ను ఫౌజీగా పరిచయం చేయడంలో తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ‘ఇప్పటివరకు ఈ ప్రయాణం మరపురానిది.. ఫౌజీ నుంచి ఈ జర్నీ మరింత పెద్దదిగా ఉంటుందని హామీ ఇస్తున్నా’ అంటూ హను పోస్ట్ చేశారు.
నిర్మాణ వివరాలు, షూటింగ్ అప్‌డేట్స్
ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సగంపైగానే పూర్తి అయింది. ఫస్ట్ షెడ్యూల్ తమిళనాడులో ప్రారంభమైంది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారణ టాక్. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
దర్శకుడు హను రాఘవపూడి చెప్పినట్లుగా, ‘ఫౌజీ’ మన చరిత్రలోని దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను చూపిస్తుంది. ప్రభాస్‌ను ఫౌజీగా పరిచయం చేయడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


