|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్‌ పెద్ద మనసు, ఫిష్‌ వెంకట్‌కి భారీ సాయం.. డోనర్‌ని రెడీ చేసుకోమంటూ భరోసా

Published: 04-07-2025, 9:20 AM
ప్రభాస్‌ పెద్ద మనసు, ఫిష్‌ వెంకట్‌కి భారీ సాయం.. డోనర్‌ని రెడీ చేసుకోమంటూ భరోసా

ప్రముఖ నటుడు ప్రభాస్ తన పెద్ద మనస్సును మరోసారి చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ ఆపరేషన్ కి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.

Key Points

1

ప్రభాస్ ఫిష్ వెంకట్ కిడ్నీ ఆపరేషన్ కి సహాయం

2

యాభై లక్షల వరకు ఖర్చు భరిస్తానని ప్రభాస్ హామీ

4

ప్రభాస్ సహాయం తో ఫిష్ వెంకట్ కు ఆశలు పెరిగాయి

ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి

డార్లింగ్‌ ప్రభాస్‌ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు. ఆయన తెలుగు ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనవంతు సాయం అందించడం మనం చూశాం. కరోనా సమయంలో, వరద బాధితులకు కోట్లల్లో సహాయాలు అందించారు. అదే సమయంలో ఆపదలో ఉన్నవారిని కూడా ఆదుకున్నారు.

సాయం కోసం తన గడపతొక్కితే కాదనకుండా సాయం చేసే మనసు ఆయనది. తన గొప్ప మనసుని చాటి చెబుతుంటారు. తాజాగా ఆయన మరోసారి ఆయన తన పెద్ద మనసుని చాటుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నటుడు ఫిష్‌ వెంకట్‌కి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

కామెడీ విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు ఫిష్‌ వెంకట్‌. ఆయన ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీలు డ్యామేజ్‌ కావడంతో చాలా కాలంగా ఆసుపత్రి పాలయ్యారు.

దాన్నుంచి కోలుకుని మామూలు మనిషి అయ్యారు, కానీ ఇప్పుడు మరోసారి ఆయన కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సారి ఆ సమస్య చాలా తీవ్రంగా మారింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

ప్రభాస్ చేసిన సహాయం

ఆపరేషన్‌ చేస్తేగానీ సెట్‌ కాదని వైద్యులు సూచించారు. అయితే వారి కుటుంబానికి ఆ స్థోమత లేదు. దీంతో సహాయం కోసం వేడుకుంటూ వస్తున్నారు.

సినీ పెద్దలు ఎవరైనా సహాయం చేస్తారేమో అని వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఫిష్‌ వెంకట్‌ భార్య స్వయంగా వేడుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్‌ స్పందించారు. ఆపరేషన్‌కి రెడీ అవ్వమని వారికి తెలిపారు. ఈ విషయాన్ని ఫిష్‌ వెంకట్‌ కూతురు వెల్లడించారు.

ప్రభాస్‌ అసిస్టెంట్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని, ఆపరేషన్‌కి రెడీ అవ్వమని, డోనర్‌ని రెడీ చేసుకోమని తెలిపినట్టు ఆమె వెల్లడించింది. అయితే కిడ్నీ డోనర్‌ కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ కి బ్లడ్‌ కలవడం లేదని తెలిపింది.

ఇతరుల నుంచి కిడ్నీ డోనర్స్ ని చూస్తున్నామని తెలిపింది. కిడ్నీ డోనర్‌ దొరికితే ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు తాము అందిస్తానని ప్రభాస్‌ టీమ్‌ తెలిపినట్టు ఆమె వెల్లడించారు.

కిడ్నీ డోనర్ అవసరం

అయితే ఈ ఆపరేషన్‌కి దాదాపుగా యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించినట్టు తెలిపారు. దీంతో ప్రభాస్‌ యాభై లక్షల వరకు సహాయం చేసేందుకు ముందుకు రావడం విశేషం.

ఇక ప్రభాస్‌ నటుడిగా ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఆయన `ది రాజా సాబ్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతోపాటు హను రాఘవపూడ దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రం చేస్తున్నారు. ఇందులోని ఆయన లుక్‌ ఇటీవలే లీక్‌ అయిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది చివర్లో `ది రాజా సాబ్‌` మూవీ విడుదల కానుంది. వచ్చే ఏడాది `ఫౌజీ` మూవీ రాబోతుంది. దీంతోపాటు `స్పిరిట్‌`, ప్రశాంత్‌ వర్మతో ఓ మూవీ, `సలార్‌ 2`, కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది.

ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ చేస్తున్న సహాయంతో ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకుంటుందని ఆశిద్దాం. ప్రభాస్‌ గొప్ప మనసుకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.