
నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 12వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ మామయ్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంది. అదే సమయంలో, విరాట్ చంద్రకళకు ఊహించని ట్రీట్మెంట్ ఇస్తాడు. కామాక్షి క్రాంతి మరియు శాలిని మధ్య విషయాలు తెలుసుకుని షాక్ అవుతుంది.
Key Points
చంద్రకళకు మామయ్య ఆరోగ్యం కోసం నాటు వైద్యుడు మందు ఇస్తాడు.
విరాట్ చంద్రకళకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు, ముద్దు పెడతాడు.
కామాక్షి క్రాంతి శాలినికి డివోర్స్ ఇవ్వడం గురించి తెలుసుకుని షాక్ అవుతుంది.
శ్రుతి, శ్యామల విరాట్ మరియు చంద్రకళను కలిసి చూసి ఆశ్చర్యపోతారు.
చంద్రకళకు మామయ్య ఆరోగ్యం
నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 12వ తేదీ ఎపిసోడ్ లో మామయ్య ఆరోగ్యం గురించి నాటు వైద్యుడితో మాట్లాడుతుంది చంద్రకళ. ఫలితం రావాలంటే మనసు కూడా శరీరానికి సహకరించాలి. అతను కోలుకోవాలంటే జీవచ్ఛవంలా ఉండాలనే ఆలోచన లేకుండా చేయాలి. అందరిలాగే అతనితో ఉండాలని చెప్పి మరో మందు ఇచ్చి పంపిస్తాడు నాటు వైద్యుడు.
నిజం తెలుసుకున్న కామాక్షి
విరాట్ మరియు చంద్రకళ రొమాన్స్
నీకు, శాలినికి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకున్నవా? మాకు ఒక్కరికైనా చెప్పాలని అనిపించలేదా? ఫ్యామిలీ ఉన్నది దేనికీ? అని క్రాంతి ని అడుగుతుంది కామాక్షి. నువ్వు శాలినికి డివోర్స్ నోటీస్ పంపించావని తెలుసని చెప్తుంది. శాలిని ఏ తప్పు చేసిందనేది క్రాంతి నోటితోనే తెలుసుకుంటుంది కామాక్షి. అసలు విషయం తెలుసుకుని కామాక్షి షాక్ అవుతుంది. ఈ విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అత్తయ్య. తను మారితే కలిసి కాపురం చేసుకుంటాం. లేదంటే ఎవరి దారి వాళ్లదేనని క్రాంతి అంటాడు.
ఆటో బుక్ చేసుకున్న చంద్రకళ .. విరాట్ కారు చూసి రైడ్ క్యాన్సిల్ చేస్తుంది. నా కారు ఎందుకు ఆపావని విరాట్ అడిగితే లిఫ్ట్ కావాలని అడుగుతుంది చంద్ర. ప్లీజ్ బావ ఇంటి దాకా లిఫ్ట్ ఇవ్వవా? అని రిక్వెస్ట్ చేస్తుంది. విరాట్ , చంద్ర కలిసి కార్లో వెళ్తారు. ఆఫీస్ విషయాలు అడగవా? అని మరీ అక్కడి విషయాలు అన్ని విరాట్ కు చెప్తుంది చంద్రకళ. అర్జున్ ను పొగడటంతో విరాట్ కు మండిపోతుంది. అనాథశ్రమంలో పిల్లల అందరి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అర్జున్ అని చెప్తుంది చంద్ర. ప్రైవసీ దొరికితే మన గురించి మాట్లాడకుండా అర్జున్ గురించి చెప్తావేంటీ అని విరాట్ అనుకుంటాడు.
కామాక్షి షాక్
అప్పుడు చంద్రకళకు ఎక్కిళ్లు వస్తాయి. వాటిని పొగొట్టడానికి చంద్రకళకు ముద్దు పెట్టాలని దగ్గరగా వెళ్తాడు విరాట్. చంద్రకళకు ఎక్కిళ్లు పోతాయి. ఎలా ఉంది నా షాక్ ట్రీట్మెంట్ అని విరాట్ అంటాడు. కొబ్బరి బోండాలు తాగుతూ రొమాంటిక్ గా చూసుకుంటూ, మాట్లాడుకుంటారు. శ్రుతి ఆ సీన్ చూసి షాక్ అవుతుంది. చంద్ర నీ సంగతి చెప్తా అని ఇంటికి వెళ్లిపోతుంది. క్రాంతి శాలినికి ఎందుకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడో తెలిసిందే అంటూ విషయమంతా చెప్తుంది కామాక్షి. చంద్ర, విరాట్ కలిసి కొబ్బరి బోండాలు తాగడం చూశానని శ్రుతి చెప్తుంది.
అప్పుడే శ్యామల వస్తుంది. విరాట్ బావ చంద్రతో కలిసి కొబ్బరి బోండాలు తాగడం నేను చూశానని శ్యామలకు శ్రుతి చెప్తుంది. ఇక శ్యామలను రెచ్చగొట్టేలా కామాక్షి మాట్లాడుతుంది. వాళ్లిద్దరు ఒక్కటే అందుకే విరాట్ గడువు పెట్టాడని కామాక్షి అంటుంది. కార్లో నుంచి దిగిన విరాట్, చంద్రను చూసి శ్యామల ఫైర్ అవుతుంది. ఆఫీస్ లు వేర్వేరు అయినప్పుడు కలిసి ఎందుకు వచ్చారని శ్యామల ప్రశ్నిస్తుంది. కొబ్బరి బోండాలు ఎలా తాగుతారని శ్రుతి అడగడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి, విరాట్ మరియు చంద్రకళ మధ్య రొమాన్స్, క్రాంతి మరియు శాలిని మధ్య వివాహ విషయం, మరియు కామాక్షి ప్రతిస్పందనతో ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. అన్ని విషయాలు ఎలా ముగుస్తాయో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాలి.


