
తెలుగు ప్రేక్షకులకు సూర్య సినిమా అంటే ఎంతో ఇష్టం. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘సూర్య-46’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి సూర్య బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ విడుదల కానుంది.
Key Points
సూర్య 46 చిత్రం ఈ నెలలో షూటింగ్ ప్రారంభం.
జులై 23న సూర్య బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్ విడుదల.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో హ్యాపీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.
మమిత బైజు, రవీనా టాండన్, రాధిక కీలక పాత్రల్లో నటించనున్నారు.
‘సూర్య-46’ చిత్రం గ్లింప్స్ విడుదల
తమిళ స్టార్ సూర్య ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ మూవీ చేయబోతున్నాడు. ‘సూర్య-46’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మలయాళ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్, రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ‘సూర్య-46’ మూవీ ఈనెల నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుదని ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే గ్లింప్స్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సూర్య బర్త్‌డే స్పెషల్‌గా జులై 23న ‘సూర్య-46’ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతూ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ‘చాలా రోజుల తర్వాత హ్యాపీ ఫ్యామిలీ సినిమాలో సూర్యను చూడబోతున్నారు. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి’ అంటూ కామెంట్స్ చేయడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సూర్య బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
సూర్య అభిమానులకు ‘సూర్య-46’ చిత్రం నుండి గ్లింప్స్ ఒక పెద్ద సర్‌ప్రైజ్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.


