|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఫిక్స్? లోకేష్ కనగరాజ్ మెగా ప్లాన్! నిజమేనా?

Published: 18-12-2025, 9:04 PM
అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఫిక్స్? లోకేష్ కనగరాజ్ మెగా ప్లాన్! నిజమేనా?
  • లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఊహాగానాలు.
  • కథ నచ్చడంతో అల్లు అర్జున్ ప్రాజెక్టుకు ఓకే చెప్పారని టాక్.
  • ఈ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్ ఉంటే పర్ఫెక్ట్ అని లోకేష్, బన్నీ భావన.
  • ఎన్టీఆర్ కు ఇంకా కథ చెప్పాల్సి ఉంది, ఆయన నిర్ణయం కీలకం.

టాలీవుడ్‌లో ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారట. ఇప్పటికే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిజమైతే అభిమానులకు పండగే.

మల్టీస్టారర్ పై టాలీవుడ్ లో చర్చ

టాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన భారీ మల్టీస్టారర్ అంటే అందరికీ గుర్తొచ్చేది RRR. రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమాలో నటించారు. తాజాగా ఎన్టీఆర్ – అల్లు అర్జున్ తో మల్టీస్టారర్ రాబోతోందంటూ టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది కూడా స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో రాబోతోందని టాక్. ఇప్పటి వరకూ RRRను తలదన్నే మల్టీస్టారర్ రావడం కష్టమనుకుంటుండగా.. ఈ మల్టీస్టారర్ ఆ అంచనాలను తారుమారు చేస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా? కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. విక్రమ్, ఖైదీ, మాస్టర వంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వస్తున్నాడని సమాచారం.

ఈ కథకోసం టాప్ హీరోలు కావాలని భావించి.. ముందుగా అల్లు అర్జున్ కు కథ కూడా వినిపించాడని టాక్. స్టోరీ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో న్యూస్ వైరల్ అవుతోంది. మల్టీస్టారర్ స్టోరీ కావడంతో.. బన్నీతోపాటు.. కీలకపాత్రకు ఎన్టీఆర్ ఉంటే పర్ ఫెక్ట్ గా ఉంటుందని లోకేష్ ఆలోచిస్తున్నాడట. బన్నీ కూడా ఎన్టీఆర్ ఉంటే సినిమా చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్ కనగరాజ్ ఫుల్ ఫోకస్ ఈ ప్రాజెక్టుపైనే పెట్టినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇంకా ఎన్టీఆర్ కు లోకేష్ స్టోరీ చెప్పాలి, దానికి ఆయన ఓకే చెప్పాలి.. అబ్బో చాలా తతంగం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ మల్టీస్టారర్ సినిమా నిజమే అయితే.. ఇద్దరి ఫ్యాన్స్ పండగ చేస్కోవడం ఖాయం.

లోకేష్ కనగరాజ్ ప్లాన్ ఏంటి?

అల్లు అర్జున్ ఓకే, ఎన్టీఆర్ సంగతేంటి?

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమేనా లేక నిజంగా కార్యరూపం దాల్చుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ వర్గాల్లో దీనిపై ఉత్సాహం నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.