|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆరు పదుల వయసులో మూడో పెళ్లికి రెడీ అయిన ఆమిర్ ఖాన్.. ఆ రోజే రిజిస్టర్డ్ మ్యారేజ్?

Published: 03-06-2026, 3:46 PM
ఆరు పదుల వయసులో మూడో పెళ్లికి రెడీ అయిన ఆమిర్ ఖాన్.. ఆ రోజే రిజిస్టర్డ్ మ్యారేజ్?

Aamir Marriage: ఆమిర్ ఖాన్… బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఈ టాప్ స్టార్ పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఎక్స్పరిమెంట్స్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ స్టార్ హీరో, ఇప్పుడు తన రియల్ లైఫ్‌లో మరో చాప్టర్ మొదలెట్టేందుకు రెడీ అయిపోయారు.

యస్ .. ఆరు పదుల వయసులో ఆమీర్ ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ తెగ వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఆమిర్, తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నాడని బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్.

వచ్చే నెల జూలై 5వ తేదీన ఒక్కటి కానున్న జోడీ

అయితే ఈ వివాహాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, అత్యంత సాదాసీదాగా జరుపుకోవాలని ఈ జంట నిర్ణయించుకుందట. వచ్చే నెల జూలై 5వ తేదీన వీరిద్దరూ కొద్దిమంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ముంబయిలో జరిగిన ఒక ప్రైవేట్ బర్త్‌డే వేడుకలో ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీని సన్నిహితులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. గౌరీ స్ప్రాట్‌కు ఇప్పటికే క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇక రెండు  కుటుంబాల సపోర్ట్ తోనే ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుండటం విశేషం.

ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకోబోతున్న ఆమీర్

ఆమిర్ ఖాన్ గత వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకు ఇది మూడో వివాహం. కెరీర్ ప్రారంభంలో 1986లో ఆయన రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జునైద్ ఖాన్ ఇటీవలే ‘మహారాజ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకోగా, కుమార్తె ఐరా ఖాన్ వివాహం గత ఏడాది ఘనంగా జరిగింది.

రీనా దత్తాతో 2002లో విడాకులు తీసుకున్న తర్వాత, ఆమిర్ ఖాన్ ప్రముఖ చిత్రనిర్మాత కిరణ్ రావును 2005లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ సినిమా ఇటీవల ఆస్కార్ బరిలో నిలిచి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెల్సిందే. ఇక  వీరిద్దరూ 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ఆమిర్ ఖాన్, ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో కొత్త జీవితాన్ని పంచుకోవడానికి రెడీ అయ్యారు.

అటెండ్ కానున్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్

ఈ సింపుల్ రిజిస్టర్డ్ మ్యారేజ్‌కు బాలీవుడ్ నుంచి కేవలం ఆమిర్ ఖాన్ అత్యంత ఆప్తమిత్రులైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మాత్రమే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ముంబయి టాక్. బాలీవుడ్ ‘ఖాన్ త్రయం’గా పిలవబడే ఈ  ముగ్గురూ ఒకచోట కలిస్తే ఫ్యాన్స్ కి మాంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.చూడాలి మరి ముచ్చటగా మూడో సారి పెళ్లి పీటలు ఎక్కుతున్న అమీర్ ఈ బంధాన్ని అయినా ఎన్ని ఏళ్ళు కాపాడుకుంటాడో !

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.