|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘పెద్ది’ విధ్వంసం షురూ! చరణ్ నటనకు ఫిదా అయిన సమంత, వరుణ్ తేజ్.. మెగా 158 టీమ్ విషెస్!

Published: 03-06-2026, 3:45 PM
'పెద్ది' విధ్వంసం షురూ! చరణ్ నటనకు ఫిదా అయిన సమంత, వరుణ్ తేజ్.. మెగా 158 టీమ్ విషెస్!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
  • ‘మెగా 158’ టీమ్ సెట్స్ నుంచే ‘పెద్ది’కి శుభాకాంక్షలు తెలిపింది.
  • సమంత, వరుణ్ తేజ్ చరణ్ నటనను ప్రశంసిస్తూ రివ్యూలు ఇచ్చారు.
  • ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సమంత, వరుణ్ తేజ్ వంటి స్టార్స్ ప్రశంసలు కురిపించగా, ‘మెగా 158’ టీమ్ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం సృష్టిస్తోంది.

‘పెద్ది’కి స్టార్స్ విషెస్: మెగా 158 టీమ్ నుండి ప్రత్యేక సందేశం

Peddi Premiere: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఎట్టకేలకి థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్ని నెలలుగాఇటు నెట్టింట్లోనూ,ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.ఆ అంచనాలకు తగ్గట్టే జూన్ 3 బుధవారం రాత్రి నుంచే వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోల సందడి మొదలైపోయింది.

జూన్ 4 గురువారం నాడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాకుండా, ఇండియన్ సినిమా సర్కిల్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. ఒక క్రీడాకారుడి కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ఊరమాస్ లుక్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్ నటన కెరీర్ బెస్ట్ అనిపించేలా ఉందట.

పెద్ది’ టీమ్‌కు విషెస్ చెప్పిన స్టార్స్

ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’ చిత్రం ప్రస్తుతం పొల్లాచి షెడ్యూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, దర్శకుడు బాబీ నేతృత్వంలోని ఆ చిత్ర బృందం సెట్స్ నుంచే ప్రత్యేకంగా ఒక వీడియో బైట్‌ను విడుదల చేసి ‘పెద్ది’ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పడం విశేషం.

FROM THE SETS OF #ChiruBobby2 … TO THE PHENOMENON CALLED #PEDDI ❤️‍🔥

Team #Mega158 proudly extend their best wishes to the Mega Power Star @AlwaysRamCharan , Director @BuchiBabusana , @vriddhicinemas and the whole team of PEDDI for a MASSIVE BLOCKBUSTER 💥💥💥

సమంత, వరుణ్ తేజ్ ప్రశంసలు: చరణ్ నటనకు ఫిదా

Shoot in progress at… pic.twitter.com/58hlIi2xWA

— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 3, 2026

రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సమంత, ఈ సినిమాపై తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. చరణ్‌లోని అసలైన టాలెంట్ ఈ సినిమాతో మరోసారి బయటకు రాబోతుందని, ఇందులో తనకు పూర్తిస్థాయి బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయనిఆకాశానికి ఎత్తేసింది. ఇక చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఈ క్యారెక్టర్ కోసం చరణ్ పడ్డ కష్టం, అంకితభావం తనకు పర్సనల్‌గా తెలుసని, బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ బ్యాటింగ్ అదరగొట్టడం ఖాయమని స్పష్టం చేశాడు.

గుండెలను పిండేస్తాయంటున్న నెటిజన్లు

ఇక సాయి దుర్గ తేజ్, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు సోషల్ మీడియాను షేక్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతుండటంతో ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై #Peddi హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో మెరిశారు. సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఫస్టాఫ్ అంతా చరణ్ క్యారెక్టరైజేషన్, ఎమోషనల్ రైడ్‌తో సాగితే, సెకండాఫ్‌లో వచ్చే ఒక నిర్దిష్టమైన సీన్ థియేటర్లలో ఆడియన్స్‌తో ఈలలు, చప్పట్లు కొట్టించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా జాన్వీ కపూర్ నటన కెరీర్ మైల్‌స్టోన్‌లా నిలిచిపోతుందని, ఒక కీలక సన్నివేశంలో ఆమె పండించిన హావభావాలు ప్రేక్షకుల గుండెలను పిండేస్తాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం: అంచనాలకు తగ్గట్టే

#Peddi అందరూ రామ్ చరణ్ గురించే మాట్లాడుతున్నారు

జాన్వి ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తుంది..విజిల్స్ వేయిస్తుంది

— devipriya (@sairaaj44) June 3, 2026

కలెక్షన్ల సునామీ ఏ రేంజ్‌లో ఉంటుందో

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయని, ఆర్‌ఆర్‌తోనే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని సినిమా చూసిన మూవీ లవర్స్  అభిప్రాయపడుతున్నారు. ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా మెగా డెబ్యూ ఇచ్చి సంచలనం సృష్టించిన బుచ్చిబాబు, ఈసారి చరణ్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేయడంలో వంద శాతం సక్సెస్ అయ్యాడని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్ల వద్ద ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొనగా, రానున్న రోజుల్లో ‘పెద్ది’ సృష్టించే కలెక్షన్ల సునామీ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ నటనతో ‘పెద్ది’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్టార్స్ ప్రశంసలు, భారీ ఓపెనింగ్స్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం సృష్టించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.