
📌 Key Points
- యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా ‘మోగ్లీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తున్నా, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 1 కోటి లోపే వసూళ్లు.
- వీకెండ్ మరియు రాబోయే పండుగ సెలవులు కలెక్షన్లకు కలిసి వచ్చే అవకాశముందని అంచనా.
- బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమాకు పోటీగా ‘మోగ్లీ’ విడుదలైనది.
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన ‘మోగ్లీ’ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను రాబట్టింది. మిశ్రమ స్పందన మధ్య, ఈ సినిమా కలెక్షన్లు వీకెండ్‌లో పెరిగే అవకాశం ఉంది. ఈ కథనం మోగ్లీ తొలి రోజు వసూళ్లు, దాని ప్రస్తుత స్థితిని వివరిస్తుంది.
మోగ్లీ తొలి రోజు ప్రపంచవ్యాప్త వసూళ్లు
Mowgli Day 1 collections: యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల(Roshan Kanakal) హీరోగా డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం మోగ్లీ(Mowgli). రోషన్, సాక్షి మా డోల్కర్ జంటగా నటించిన ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ, అనుకున్న విధంగా అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాగా, 12వ తేదీ ప్రీమియర్లు ప్రసారమయ్యాయి. ఇక ఈ సినిమా మొదటి రోజు విజయవంతంగా పూర్తి కావడంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్లకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా ప్రీమియర్లతో కలుపుకొని మొదటి రోజు రూ. 1 కోటికి లోపే కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1 కోటి నెట్ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక రెండవ రోజు వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమా మెల్లిమెల్లిగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో కలెక్షన్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక బాలకృష్ణ నటించిన ఆఖండ 2 సినిమాకు పోటీగా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
సినిమాకు మిశ్రమ స్పందన, వీకెండ్ అంచనాలు
సినిమాకు కూడా అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదని చెప్పాలి. దీంతో మోగ్లీ సినిమా కలెక్షన్లు కాస్త పుంజుకున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ 25 వరకు ఎలాంటి సినిమాలు విడుదల కాని నేపథ్యంలో ఈ సినిమాలకు కలెక్షన్ల పరంగా కలిసి వస్తుందని తెలుస్తోంది . మరి వీకెండ్ కావడంతో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రోషన్ లోకేషన్ మేనేజర్ గా కనిపించబోతున్నారు. ఇక సాక్షి మూగమ్మాయిగా కనిపించిన సంగతి తెలిసిందే.
విలన్ పాత్రలో బండి సరోజ్..
మోగ్లీలో ప్రధాన పాత్రలు, నిర్మాణ వివరాలు
బబుల్ గమ్ లాంటి లవ్ రొమాంటిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోషన్ అనంతరం ఇలాంటి యాక్షన్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఈ సినిమాలో రోషన్ కనకాల నటన అద్భుతం అని చెప్పాలి. ఇక విలన్ పాత్రలో బండి సరోజ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కలర్ ఫోటో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సందీప్ రాజ్ డైరెక్షన్లో సినిమా రాబోతుందని తెలియగానే సినిమా పట్ల మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ అనుకున్న స్థాయిలో సినిమా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. ఇక ముందు ముందు ఈ సినిమా ఏ విధమైనటువంటి కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.
‘మోగ్లీ’ చిత్రం మొదటి రోజు మిశ్రమ ఫలితాలను చవిచూసినప్పటికీ, వీకెండ్ మరియు రాబోయే సెలవులు వసూళ్లకు కలిసొచ్చే అవకాశముంది. సినిమా మెల్లగా సానుకూల టాక్ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో దాని ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.


