|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది

Published: 09-12-2025, 3:48 AM
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
  • ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్స్ కోసం జపాన్‌లో ఉన్నారు.
  • జపాన్‌లో 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో అభిమానులు ప్రభాస్ భద్రతపై ఆందోళన చెందారు.
  • దర్శకుడు మారుతి ప్రభాస్ సురక్షితంగా ఉన్నారని, భూకంపం వచ్చిన ప్రాంతంలో లేరని ధృవీకరించారు.
  • ప్రభాస్ తదుపరి చిత్రం ‘రాజాసాబ్’ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

జపాన్‌లో సంభవించిన తీవ్రమైన భూకంపం ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. బాహుబలి ప్రమోషన్స్ నిమిత్తం జపాన్‌లో ఉన్న రెబల్ స్టార్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రభాస్ సురక్షితంగా ఉన్నారని దర్శకుడు మారుతి స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రభాస్ జపాన్ పర్యటన వివరాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభాస్ కి పెద్ద గండం తప్పింది. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో జపాన్ లో బిజీగా ఉన్నారు. బాహుబలి చిత్రానికి బాగా ఆదరణ లభించిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి. దీనితో బాహుబలి ది ఎపిక్ చిత్రాన్ని డిసెంబర్ 12 రిలీజ్ చేస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉండగా అభిమానులకు ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. జపాన్ లో సోమవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.5 గా నమోదైంది. జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం ఎక్కువగా  నమోదు కాగా దాని ప్రభావం టోక్యో లాంటి నగరాలపై కూడా పడింది.

భూకంపంతో అభిమానుల ఆందోళన

దీనితో ప్రభాస్ అభిమానులు కంగారు పడ్డారు. తమ హీరో ఎలా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం ప్రారంభించారు. ప్రభాస్ అభిమానుల ఫ్యాన్ పేజీ నుంచి ఓ పోస్ట్ వైరల్ అయింది. జపాన్ లో భూకంపం, సునామీ వార్నింగ్ కూడా ఇచ్చారు. హీరో ఎక్కడ ఉన్నారు ? ఈ రోజు రిటర్న్ అవుతారా ? అంటూ పోస్ట్ వైరల్ అవుతోంది.

అభిమాని పోస్ట్ కి రాజా సాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. డార్లింగ్ ప్రభాస్ తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ప్రభాస్ లేరు. సేఫ్ గా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని మారుతి క్లారిటీ ఇచ్చారు. దీనితో ప్రభాస్ అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

మారుతి క్లారిటీ: ప్రభాస్ సురక్షితం

ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. హారర్ కామెడీ చిత్రంగా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

మొత్తానికి, జపాన్ భూకంపం నుండి ప్రభాస్ సురక్షితంగా బయటపడటంతో అభిమానుల ఆందోళన తొలగిపోయింది. త్వరలో విడుదల కానున్న రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ మళ్ళీ బిజీ కానున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.