
📌 Key Points
- కల్కి 2898 AD సంచలన విజయం, కలెక్షన్ల రికార్డులు బద్దలు!
- దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి? నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు!
- ప్రభాస్, సాయి పల్లవిల జోడిపై ట్రోల్స్.. కొందరు సపోర్ట్, మరికొందరు విమర్శలు!
- రెండో భాగంలో సాయి పల్లవి పాత్ర మరింత కీలకం కానుందట!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌లో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కల్కితో సాయి పల్లవి జోడి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) ఎంతటి విజయాన్ని సాధించిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. నాగ్ అశ్విన్(Nag Ashwin ) తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది. ఆమె పోషించిన ‘సుమతి’ పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. రెండో భాగంలో ఆ పాత్ర ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందట.
నెట్టింట ట్రోల్స్.. కారణం ఇదే!
అయితే.. దీపికాను ఆ సినిమా నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ప్లేస్‌లో దర్శకుడు నాగ్‌అశ్విన్ సాయిపల్లవి(Sai Pallavi)ని చూస్ చేసుకున్నాడనే ఓ వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఓ ఫొటో నెట్టింట ట్రోల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫొటోలో కల్కీ గెటప్‌లో ప్రభాస్ అండ్ సాయి పల్లవి కనిపించారు. నేచురల్ బ్యూటీ కడుపుతో ఉండగా ఆమెను డార్లింగ్ హత్తుకున్నట్లు ఉంది. ఇక ఈ పిక్‌కు ప్రభాస్ పక్కన సాయి పల్లవి ఎలుక పిల్లలా ఉంది అని, సాయి పల్లవి బదులు కార్తీక దీపం దీపను పెట్టినా సెట్ అవుతుంది అని, ఏడ్చే క్యారెక్టర్ ఉంటే ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అని వివిధ రకాలుగా ట్రోల్ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఆమెకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.
రెండో భాగంలో సాయి పల్లవి!
A post shared by chal mingey bey (@chal_mingey_bey_official)
కల్కి 2898 AD సీక్వెల్‌లో సాయి పల్లవి నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


