|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రీఛార్జ్ కోసం ఇటలీలో ప్రభాస్! నెక్స్ట్ లెవెల్ మేకోవర్ అంటా!!

Published: 01-04-2026, 1:35 PM
షాకింగ్: రీఛార్జ్ కోసం ఇటలీలో ప్రభాస్! నెక్స్ట్ లెవెల్ మేకోవర్ అంటా!!
  • ప్రభాస్ ఇటలీలో: రాజాసాబ్ ఫలితంతో పునరుత్తేజానికి విరామం!
  • హను రాఘవపూడి ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ చిత్రాలపై దృష్టి సారిస్తున్న ప్రభాస్.
  • ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 కోసం కొత్త మేకోవర్!
  • త్వరలో షూటింగ్, విడుదల తేదీలపై ప్రకటన వచ్చే అవకాశం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఒక సంచలన వార్త! రాజాసాబ్ మూవీ తర్వాత డార్లింగ్ కాస్త విరామం తీసుకుని, తన లుక్ మార్చుకోవడానికి ఇటలీ వెళ్ళాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రాజాసాబ్ ఎఫెక్ట్: బ్రేక్ తీసుకున్న ప్రభాస్

ప్రజెంట్ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇటీవల వచ్చిన ‘రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడంతో.. తన తదుపరి చిత్రాలపై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు డార్లింగ్. ఈ మేరకు కొంచెం విరామం తీసుకుని మేకోవర్ అయ్యేందుకు, అలాగే రీచార్జ్ అవ్వడానికి ఇటలీకి చెక్కేశాడు. గత కొద్ది రోజులుగా నిర్విరామంగా షూటింగ్స్‌లో పాల్గొంటున్న ఈ పాన్ ఇండియా స్టార్ వేసవి వెకేషన్ కోసం ఇటలీకి బయలుదేరారు. ఈ మేరకు తాజాగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. కొద్ది రోజులు అక్కడే ఉండి ఫుల్ మేకోవర్ అయ్యాక మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో.. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 వంటి బాక్సాఫీష్‌ను షేక్ చేసే చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ ఇటలీ నుంచి వచ్చాక ఈ సినిమాల షూటింగ్, రిలీజ్‌లపై కూడా అప్డే్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇటలీలో డార్లింగ్: మేకోవర్ కోసం ప్లాన్!

ఫౌజీ, స్పిరిట్, కల్కి: ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్

ప్రభాస్ ఇటలీ టూర్ పూర్తి చేసుకుని రాగానే.. ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. డార్లింగ్ సినిమాల గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.