|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోయిన్‌తో ప్రభాస్‌ మ్యారేజ్‌.. పెద్దమ్మ రియాక్షన్‌ ఇదే.. ఆయన చేతుల్లోనే డార్లింగ్‌ పెళ్లి

Published: 12-08-2025, 7:50 AM
హీరోయిన్‌తో ప్రభాస్‌ మ్యారేజ్‌.. పెద్దమ్మ రియాక్షన్‌ ఇదే.. ఆయన చేతుల్లోనే డార్లింగ్‌ పెళ్లి

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

ప్రభాస్ పెళ్ళి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి తాజా వ్యాఖ్యలు.

2

ప్రభాస్ పెళ్లికి శివుడిని ఆశ్రయించిన పెద్దమ్మ.

4

ప్రభాస్ వృత్తి జీవితం, భవిష్యత్ సినిమాల గురించి వివరాలు.

ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ వ్యాఖ్యలు

ప్రభాస్‌ తెలుగు సినిమా లెక్కలు మార్చిన హీరో. అంతేకాదు ఇండియన్‌ సినిమాని ఏకం చేసిన హీరో. `బాహుబలి` సినిమాతో పాన్‌ ఇండియా ట్రెండ్‌కి తెరలేపి, ఏ భాష సినిమా అయినా ఇతర భాషల్లో డైరెక్ట్ గా రిలీజ్‌ చేసుకునే ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన హీరో. ఓవరాల్‌గా భాష అనే బౌండరీలను బ్రేక్‌ చేసిన హీరోగా చెప్పొచ్చు. ఇప్పుడు మోస్ట్ కమర్షియల్‌ హీరోగా, అత్యంత మార్కెట్‌ ఉన్న హీరోగా డార్లింగ్‌ నిలిచారు. ఆయన పేరుతోనే ఐదారు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి లేదు.

ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ఆరు సినిమాలున్నాయి. రెండు చిత్రీకరణ దశలో ఉండగా, మరో నాలుగు ప్రారంభం కావాల్సి ఉంది. మరికొన్ని కమిట్‌ అయిన సినిమాలున్నాయి. ఒక్కో మూవీ బిజినెస్‌ వ్యాల్యూ చూస్తే ఈజీగా వెయ్యి కోట్లుగా చెప్పొచ్చు. సినిమా హిట్‌ అయితే రూ. 1500కోట్ల వరకు ఆశించవచ్చు. ఎంత ఎదిగినా, ఎంత స్టార్‌డమ్‌ ఉన్నా, చాలా సింపుల్‌గా ఉంటారు ప్రభాస్‌. ఆ ఇమేజ్‌ తాలూకూ యాటిట్యూడ్‌ ఎక్కడా కనిపించదు. ఎవరినైనా డార్లింగ్‌ అంటూ, మంచి భోజనం పెడుతూ బాగా చూసుకుంటారు.

ప్రభాస్‌ వృత్తి జీవితం

ఇంత మంచి లక్షణాలు కలిగిన ప్రభాస్‌ మాత్రం ఇంక పెళ్లి చేసుకోలేదు. ఆయన ఓ ఇంటివాడు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫ్యామిలీ కోరుకుంటుంది. కానీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. దాదాపు పది ఏళ్ల నుంచి ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు పెళ్లి చేస్తామని చెప్పారు. అమ్మాయిని చూస్తున్నామని తెలిపారు. కానీ ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. ఇప్పుడు కృష్ణంరాజు లేకపోవడంతో ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవికి ఆ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై ఆమె తరచూ సమాధానం చెబుతూనే ఉంది. పెళ్లిచేస్తాం, టైమ్‌ రావాలి అని అంటూనే ఉంది. కానీ ఎప్పుడు చేస్తారు? ప్రభాస్‌ రియాక్షన్‌ ఏంటనేది వెల్లడించలేదు.

తాజాగా మరోసారి ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవికి డార్లింగ్‌ పెళ్లి ప్రశ్న ఎదురయ్యింది. ఆమె సోమవారం ద్రాక్షారామంలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్‌ పెళ్లిపై రియాక్ట్ అయ్యింది. పెళ్లి చేస్తామని, ప్రభాస్‌ పెళ్లి జరుగుతుందని తెలిపింది. ప్రభాస్‌ పెళ్లి కోసం అభిమానులతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. `బాబుకి పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకున్నాను` అని తెలిపింది. అయితే ఈ సందర్భంగా ప్రభాస్‌ పెళ్లికి శివుడికి ముడిపెట్టింది. ఈ ఏడాది ఉంటుందా? అని రిపోర్టర్‌ ప్రశ్నించగా, `శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రభాస్‌ పెళ్లి జరుగుతుంద`ని తెలిపింది శ్యామలాదేవి. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుందని, అలాగే ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారి పెళ్లిళ్లు కూడా జరగాలని ఆమె తెలిపారు. ఆమె సమాధానం ప్రకారం ప్రభాస్‌ పెళ్లి శివుడి చేతిలో ఉందని చెప్పొచ్చు.

అభిమానుల ఆశలు

ఈ సందర్భంగా రిపోర్టర్స్ నుంచి క్రేజీ ప్రశ్న ఎదురయ్యింది. ప్రభాస్‌కి పెళ్లి సినిమా హీరోయిన్‌తో చేస్తారా? బయట రిలేటివ్‌ అమ్మాయితో ఉంటుందా? అని ప్రశ్నించగా, ఆ విషయం తెలియదంటూ నవ్వుతూ రియాక్ట్ అయ్యింది శ్యామలాదేవి. కాకపోతే పెళ్లి మాత్రం జరుగుతుందని స్పష్టం చేసింది. మరి ఎప్పటిలాగే ప్రభాస్‌ పెళ్లికి సంబంధించిన సస్పెన్స్ అలానే వదిలేసింది. ప్రభాస్‌, అనుష్క ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలు తరచూ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే వీరి మధ్య లవ్‌ ఉందా? అనేది సస్పెన్స్. ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా? ఎవరిని చేసుకుంటానే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన కొంత షూటింగ్‌ పార్ట్ పెండింగ్‌లో ఉంది. డిసెంబర్‌ 5న మూవీ విడుదల కాబోతుంది. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ`(వినిపిస్తున్న పేరు) చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు కేవలం 50శాతం మాత్రమే షూటింగ్‌ కంప్లీట్‌ అయినట్టు సమాచారం. ఇది వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇంకోవైపు సెప్టెంబర్‌లో `స్పిరిట్‌` మూవీని స్టార్ట్ చేయాలని సందీప్‌ రెడ్డి వంగా ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్‌ వర్మతో ఓ మూవీ, `సలార్‌ 2`, కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది ప్రభాస్‌.

ప్రభాస్ పెళ్లి విషయంలో పెద్దమ్మ శ్యామలాదేవి ఆశాజనకంగా మాట్లాడారు. అయితే ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించబడలేదు. అభిమానులు మరియు కుటుంబం డార్లింగ్ పెళ్లికి ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.