|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ నంబర్ రిధి కుమార్ ఫోన్‌లో ఏ పేరుతో ఉందో తెలిసి ఫ్యాన్స్ షాక్!

Published: 05-01-2026, 5:30 AM
ప్రభాస్ నంబర్ రిధి కుమార్ ఫోన్‌లో ఏ పేరుతో ఉందో తెలిసి ఫ్యాన్స్ షాక్!
  • రిధి కుమార్ ఫోన్‌లో ప్రభాస్ నంబర్ “ప్రభాస్” పేరుతోనే సేవ్ చేయబడింది.
  • మూడేళ్ల క్రితం ప్రభాస్ ఇచ్చిన చీరను రిధి ఇప్పటికీ ప్రేమగా దాచుకుంది.
  • ‘ది రాజా సాబ్’ అవకాశం మొదట స్పామ్ కాల్ అనుకుని రిధి నవ్వింది.
  • ‘రాధే శ్యామ్’ సమయంలో ప్రభాస్ తన నటనను మెచ్చుకున్నారని వెల్లడించింది.

ది రాజా సాబ్ నటి రిధి కుమార్ ప్రభాస్ ఫోన్ నంబర్‌ను తన ఫోన్‌లో ఎలా సేవ్ చేసిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె సమాధానం ప్రభాస్ అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ప్రభాస్‌తో తన అనుబంధం గురించి కూడా పంచుకుంది.

రిధి కుమార్ ఫోన్‌లో ప్రభాస్ నంబర్ సేవింగ్ ఎలా?

Prabhas Phone Number in Ridhi Kumar Phone: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా..దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. హారర్, కామెడీ, రొమాన్స్..ఫన్ అంశాలు కలిసిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, అలాగే యువ నటి రిధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా రిధి కుమార్ పేరు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.

ఆ ఈవెంట్‌లో మూడు సంవత్సరాల క్రితం ప్రభాస్ తనకు ఒక చీరను బహుమతిగా ఇచ్చారని, అది తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకమని రిధి కుమార్ వెల్లడించింది. ఇప్పటికీ ఆ చీరను ఎంతో ప్రేమగా దాచుకుని, అదే చీరను ఈ ఈవెంట్‌కు కట్టుకుని వచ్చానని ఆమె చెప్పడంతో..ప్రభాస్‌–రిధి కుమార్ మధ్య ఇంత అనుబంధం ఉందా అనే చర్చ మొదలైంది. అప్పటి నుంచే ఆమె వార్తల్లో సెంటర్ ఆఫ్ ఫోకస్ అయిపోయింది.

ప్రభాస్‌తో రిధి కుమార్ అనుబంధం, ‘రాధే శ్యామ్’ జ్ఞాపకాలు

ఇక అప్పటి నుంచి ఈ హీరోయిన్ ఏం మాట్లాడినా అది పెద్ద వార్తగా మారుతోంది. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిధి కుమార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. యాంకర్ “మీ దగ్గర ప్రభాస్ నెంబర్ ఉందా?” అని అడగగా, “అవును, ఉంది” అని ఆమె సమాధానం చెప్పింది. ఆ నెంబర్‌ను ఫోన్‌లో ఎలా ఫీడ్ చేసుకున్నారు అని అడిగితే, “ప్రభాస్ అని పేరుతోనే సేవ్ చేసుకున్నాను” అని చెప్పింది. దీంతో ఆమె ఫోన్‌లో ప్రభాస్ పేరు ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్న అభిమానులకు ఆన్సర్ దొరికినట్లైంది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించమని మొదట ఫోన్ కాల్ వచ్చినప్పుడు అది స్పామ్ కాల్ అనుకున్నానని నవ్వుతూ చెప్పింది. తర్వాత నిర్మాత ఎస్‌కెఎన్ నుంచి కాల్ వచ్చిందని తెలిసిన తర్వాతే అది నిజమని నమ్మానని వివరించింది.

రిధి కుమార్ ఇప్పటికే ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో తన నటనను ప్రభాస్ ఎంతో మెచ్చుకున్నారని, తన పర్ఫార్మెన్స్‌పై ఆయన చెప్పిన మాటలు తనకు చాలా ధైర్యం ఇచ్చాయని తెలిపింది. అదే నమ్మకంతో ‘ది రాజా సాబ్’ సినిమాలో మరోసారి అవకాశం రావడం తన అదృష్టమని చెప్పింది.

‘ది రాజా సాబ్’ అవకాశం: స్పామ్ కాల్ అనుకున్న రిధి

ప్రస్తుతం రిధి కుమార్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్‌పై ఆమె చూపించిన గౌరవం, అభిమానాన్ని చూసి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘ది రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులకు ఒక రోలర్‌కోస్టర్ అనుభూతిని.. ఇస్తుందని ఆమె నమ్మకంగా చెబుతోంది.

రిధి కుమార్ ప్రభాస్‌తో తన అనుబంధం, ఆయన ఫోన్ నంబర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రభాస్‌పై చూపిన గౌరవం, అభిమానం ఈ ఇంటర్వ్యూతో మరోసారి వెల్లడైంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.