|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ సంచలనం: యంగ్ డైరెక్టర్లకు ఇక నో ఛాన్స్! కారణం ఇదేనా?

Published: 13-02-2026, 3:35 AM
ప్రభాస్ సంచలనం: యంగ్ డైరెక్టర్లకు ఇక నో ఛాన్స్! కారణం ఇదేనా?
  • ప్రభాస్ ఇకపై యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
  • బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు.
  • ప్రభాస్ నటించిన తాజా హారర్ కామెడీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
  • గతంలో ఒక యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసి నిరాశపడిన ప్రభాస్ మళ్ళీ అదే తప్పు చేయకూడదని భావిస్తున్నాడు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇకపై యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. దీనికి గల కారణాలపై ఒక లుక్ వేద్దాం.

ప్రభాస్ సంచలన నిర్ణయం వెనుక కారణం?

Prabhas : టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి తర్వాత ఆ హీరో లైఫ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీని తర్వాత ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. బడ్జెట్ మూవీస్ చేస్తూ ఐదు భాషల్లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మన టాలీవుడ్ సీనియర్‌ స్టార్స్ ఇప్పుడు ట్రాక్ మార్చారు. ఈ మధ్య కొంతమంది స్టార్ హీరోలు యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నారు.. అయితే ఎవరు కూడా మళ్లీ సక్సెస్ అయిన దాఖలాలు ఇప్పటివరకైతే కనిపించలేదు.. దాంతో మళ్లీ సీనియర్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ఈ క్రమంలో ప్రభాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇకమీదట అలాంటి వారికి అస్సలు ఛాన్స్ ఇవ్వడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. మరి డార్లింగ్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కు చేరింది. దాంతో ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా స్టార్ డైరెక్టర్లతోనే చేశాడు. అయితే ఈమధ్య కొన్ని చిన్న సినిమాలు వచ్చిన సరే.. వాటిని పక్కన పెట్టి సీనియర్ డైరెక్టర్లతో సినిమాలు చేశాడు. రీసెంట్‌గా విడుదలైన ప్రభాస్ హారర్ కామెడీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోగా, కథ ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని విమర్శలు ఎదురవుతున్నా సరే. తీరు మార్చుకోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆయన ఓ డైరెక్టర్ తో సినిమా చేశాడు. దాని దారుణంగా ఉంది. అయితే ఇన్నాళ్ల తర్వాత మరో సినిమాకి ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమా కూడా తేడా కొట్టింది.. అందుకే ఇక మీదట చిన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడని ఫిలింనగర్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం అయితే ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది..

పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదుగుదల

ప్రభాస్ కొత్త సినిమా ఫలితం ఎలా ఉంది?

ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోలలో ప్రభాస్ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది. ఈమధ్య ఈయన నటిస్తున్న ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతని క్రేజీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇండియాలో మాత్రమే కాదు జపాన్ లాంటి విదేశాలలో కూడా ప్రభాస్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన అరడజను సినిమాలకు పైగా నటిస్తున్నాడు. డైరెక్టర్ హను రాగపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు. వాటితో పాటుగా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల సీక్వెల్స్ లో నటిస్తున్నాడు.

ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మరి రాబోయే రోజుల్లో ప్రభాస్ ఎలాంటి దర్శకులతో పనిచేస్తారో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.