
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్ తో మూడు సినిమాలు చేయడానికి అంగీకరించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరించారు. విజయ్ కిరంగందూర్ తో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు.
Key Points
ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్‌తో మూడు సినిమాలు చేస్తున్నారు.
విజయ్ కిరంగందూర్‌తో ఉన్న మంచి అనుబంధాన్ని ప్రభాస్ వివరించారు.
కేజీఎఫ్ షూటింగ్ సమయంలో జరిగిన ఘటనను ప్రస్తావించారు.
విజయ్ కిరంగందూర్‌ను తన కుటుంబ సభ్యుడిగా ప్రభాస్ పేర్కొన్నారు.
హోంబలే ఫిల్మ్స్ తో ప్రభాస్ సహకారం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. సోషల్ మీడియాకు కూడా పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం డార్లింగ్ కల్కి-2, స్పిరిట్, ఫౌజి, ది రాజాసాబ్(The Rajasaab) వంటి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మూడు సినిమాలు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దీంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films)బ్యానర్‌పై మూడు చిత్రాలు చేయడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కేజీఎఫ్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన నాకు ఇంకా గుర్తుంది.
భారీ సెట్ వేసి షూటింగ్ చేస్తుండగా.. అనుకోకుండా మంటలు అంటుకుని కాలిపోయింది. దీంతో అది చూసిన టీమ్ అంతా కంగారుపడిపోమారు. ఆసమయంలో విజయ్ కంగారు పడొద్దు డబ్బులు గురించి ఆలోచించొద్దు. అనుకున్నట్లుగానే సినిమాను పూర్తి చేయండి అని హామీ ఇచ్చారు. మేకింగ్ విషయంలో అస్సలు రాజీపడరు. అది నాకెంతో నచ్చింది. విజయ్ కిరంగందూర్(Vijay Kirangamdoor)తో పని చేసేవాళ్లను జాగ్రత్తగా చూసుకుంటారు. అందరితో చాలా తొందరగా కలిసిపోతారు. ‘సలార్’తో మా జర్నీ స్టార్ట్ అయింది. మేమంతా ఓ కుటుంబంలా కలిసిపోయాం. ఆయన నా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. అందుకే హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మూడు సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
విజయ్ కిరంగందూర్ తో ప్రభాస్ అనుబంధం
కేజీఎఫ్ షూటింగ్ అనుభవం
ప్రభాస్ మరియు విజయ్ కిరంగందూర్ మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఈ వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి. హోంబలే ఫిల్మ్స్ తో ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.


