|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రేమ కోసం ప్రభాస్ పరితపన! పెళ్లిపై నో కామెంట్.. మనసు విప్పిన బాహుబలి!

Published: 20-02-2026, 4:05 AM
ప్రేమ కోసం ప్రభాస్ పరితపన! పెళ్లిపై నో కామెంట్.. మనసు విప్పిన బాహుబలి!
  • ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతి అని, దాని కోసం ఎదురు చూస్తున్నానని ప్రభాస్ అన్నారు.
  • పెళ్లి గురించి ఆలోచించకపోయినా, ప్రేమలో పడాలని ఉందని ప్రభాస్ చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
  • ప్రభాస్ ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాపై ప్రభాస్ రివ్యూ ఇచ్చారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రేమ గురించి మొదటిసారిగా మాట్లాడారు. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ప్రేమలో పడాలని ఉందని, ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ప్రేమ గురించి ప్రభాస్ ఏమన్నారంటే?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా ఒకవైపు కెరియర్ పరంగా బిజీ అవుతూనే మరోవైపు ఇతర సినిమాలకు ప్రభాస్ పూర్తిస్థాయిలో తన మద్దతు తెలియజేస్తూ ఉంటారు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా విడుదల కావడంతో ప్రభాస్ ఈ సినిమాపై తన రివ్యూ ఇవ్వడంతో సినిమా పట్ల మరింత బజ్ క్రియేట్ అయింది అయితే తాజాగా ఈ చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ తనకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ గురించి కూడా ప్రభాస్ మాట్లాడటంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కపుల్ ఫ్రెండ్లీ సినిమా హీరోయిన్ మానస వారణాసి ప్రభాస్ ను ప్రశ్నిస్తూ ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రభాస్ ను అడిగింది. ఇలా మానస వారణాసి ఈ ప్రశ్న వేయడంతో వెంటనే ప్రభాస్ ఇది మీకు పర్సనల్ క్వశ్చన్ కదా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇక ఈ ప్రశ్నకు ప్రభాస్ సమాధానం చెబుతూ.. ప్రేమపై నా ఒపీనియన్ అంటే అది మీ కపుల్ ఫ్రెండ్లీ సినిమా అని తెలిపారు. ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్ నాకు ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలని ఉందని , ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన ప్రేమపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న ప్రభాస్ కామెంట్స్

ఇలా ప్రేమలో పడాలని ఉంది అంటూ ప్రభాస్ చెప్పకనే చెప్పేయడంతో అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు పెళ్లి అంటేనే ఆసక్తి చూపించని ప్రభాస్ ఇప్పుడు ప్రేమలో పడాలని ఉంది అంటూ చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభాస్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పుడు నాలుగు పదుల వయసులో ఉన్నారు. ఇలా 46 సంవత్సరాల వయసు వచ్చిన ఈయన మాత్రం ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ప్రభాస్ తో పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో హీరోయిన్లు అందరూ ఇప్పటికే తమ వారసులను కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నా, ఈయన మాత్రం ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు.

ఈ ఏడాదిలోనే ఫౌజీ విడుదల..

ప్రభాస్ పెళ్లిపై అభిమానుల ఆందోళన

ఇక ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గతంలో ప్రభాస్ పలువురు హీరోయిన్లతో ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కానీ ఈ వార్తలు నిజం కాదని ప్రభాస్ కొట్టి పారేశారు. మరి ప్రభాస్ పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో వేచి చూడాలి. ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఈయన సందీప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను నిరాశపరిచారు. ఇక ఈ ఏడాదిలో ఫౌజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రభాస్ ప్రేమ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన త్వరలోనే శుభవార్త చెబుతారేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.