
📌 Key Points
- ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
- ఈవెంట్‌లో ప్రభాస్ పిలక హెయిర్ స్టైల్‌తో సరికొత్త, అదరిపోయే లుక్‌లో కనిపించాడు.
- ఈ పిలక లుక్ తన ‘స్పిరిట్’ సినిమా కోసమేనని ప్రభాస్ స్వయంగా వెల్లడించాడు.
- డార్లింగ్ కొత్త స్టైల్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సరికొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పిలక స్టైల్‌లో కనిపించిన డార్లింగ్, అది తన ‘స్పిరిట్’ సినిమా కోసం అని స్పష్టం చేయడంతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. అతని ఈ స్టైలిష్ ఎంట్రీ ప్రస్తుతం వైరల్ గా మారింది.
రాజాసాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ అదిరిపోయే ఎంట్రీ
Prabhas : ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రాజాసాబ్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.(Prabhas)
నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీగా నిర్వహిస్తున్నారు. ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత జనాల ముందుకు వస్తుండటంతో ఈ ఈవెంట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. పిలక వేసుకొని వచ్చి సరికొత్త లుక్ లో అదరగొట్టాడు. దీంతో ప్రభాస్ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
వైరల్ అవుతున్న ప్రభాస్ ‘పిలక’ స్టైల్ రహస్యం
ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన డార్లింగ్
గతంలో కల్కి సినిమాలో పిలక వేసుకొని ప్రభాస్ అలరించాడు. ఇప్పుడు బయట ఈవెంట్ కి ఇలా పిలక వేసుకొని రావడంతో ఫ్యాన్స్ ఈ కొత్త లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రభాస్ త్వరలో స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. దీంతో ఇది స్పిరిట్ లుక్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అయితే కల్కి 2 లుక్ అని, లేదా సరదాగా ఈవెంట్ కి ఇలా పిలక వేసుకొచ్చాడు అని అంటున్నారు. అయితే స్పిరిట్ షూట్ నుంచే వస్తున్నాను అని సుమ అడిగిన ప్రశ్నల్లో ప్రభాస్ తెలిపాడు. దీంతో ఈ లుక్ స్పిరిట్ సినిమా అని తెలిసిపోతుంది. మొత్తానికి ప్రభాస్ తన పిలక హెయిర్ స్టైల్ తో వైరల్ అవుతున్నాడు.
మొత్తానికి, ‘రాజాసాబ్’ ఈవెంట్‌లో ప్రభాస్ పిలక హెయిర్ స్టైల్, ‘స్పిరిట్’ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అభిమానులు డార్లింగ్ కొత్త లుక్‌ని ఎంతగానో ఆస్వాదిస్తూ, అతని రాబోయే సినిమాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.


