
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ లైనప్‌లోకి మరో భారీ సినిమా చేరింది. ఆస్కార్ విజేత కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక అద్భుతమైన కథను ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా వివరాలు, బడ్జెట్ గురించి తెలుసుకుందాం.
Key Points
ప్రభాస్ లైనప్‌లో 'రాజాసాబ్, స్పిరిట్, సాలార్ 2' వంటి భారీ సినిమాలున్నాయి.
ఆస్కార్ విజేత ప్రేమ్ రక్షిత్ 'నాటు నాటు' పాటకు కొరియోగ్రఫీ అందించారు.
ప్రేమ్ రక్షిత్ వినిపించిన అద్భుతమైన కథకు ప్రభాస్ వెంటనే ఓకే చెప్పాడు.
రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా త్వరలోనే తెరకెక్కనుంది.
ప్రభాస్ లైనప్: భారీ చిత్రాల వరుస
Prabhas-Prem rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల గురించి, ఆయన లైనప్ గురించి(Prabhas-Prem rakshith) ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేస్తున్న ఒక్కో సినిమా చూస్తూనే బాక్సాఫీస్ కి ముచ్చెమటలు పెట్టె అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, సాలార్ 2, కల్కి 2 ఇలా ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ రేంజ్ పాన్ ఇండియా సినిమాలు వేరే ఏ హీరోకి లేకపోవడం గమనార్హం. దీంతో ఈ లైనప్ చూసి ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ గా ఉన్నారు. అయితే, ఈ క్రేజీ లైనప్ లోకి మరో మూవీ చేరింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Manchu Lakshmi: బోల్డ్ గా మాట్లాడితే, బొడ్డు కనిపిస్తే తప్పేంటి.. అవి విని చాలా ఏడ్చాను.. కానీ అక్కడ అలా..
ఆస్కార్ విన్నర్ ప్రేమ్ రక్షిత్: ప్రత్యేకత ఏమిటి?
టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాజికల్ డాన్స్ మూమెంట్స్ క్క్రియేట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ పోతినేని, రవి తేజ, నితిన్ ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోలకి ఆయన డాన్స్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక ఆర్ఆర్ఆర్ ఆయన డాన్స్ మూమెంట్స్ అందించిన నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం వరించింది. నిజానికి ఈ పాట విజయంలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్ మూమెంట్స్ ప్రధాన కారణం అనే చెప్పాలి. ఆస్కార్ రావడానికి కూడా అదే కారణం.
ప్రభాస్ – ప్రేమ్ రక్షిత్ భారీ సినిమా వివరాలు
అలాంటి ప్రేమ్ రక్షిత్ రీసెంట్ గా అద్భుతమైన కథను ప్రభాస్ కి వినిపించాడట. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అలాంటి కథతో సినిమా రాలేదని తెలుస్తోంది. ఈ రీసెంట్ గా ఈ కథను ప్రభాస్ కి వినిపించడంతో పబాగా నచ్చేసిందట. వెంటనే ఒకే చెప్పేశాడట. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే ప్రేమ్ రక్షిత్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట ప్రభాస్. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో రానున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి తన మొదటి సినిమాతో ప్రేమ్ రక్షిత్ ఆడియన్స్ ను ఎలా సాటిస్ఫై చేస్తాడు అనేది చూడాలి.
ఇండియన్ సినిమా చరిత్రలో రాని కథతో, రూ.800 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, ప్రేమ్ రక్షిత్ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం సినీ ప్రియులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


