|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘రాజాసాబ్’ రెమ్యూనరేషన్ లీక్! ఎవరికి ఎంత ముట్టిందో తెలిస్తే మైండ్ బ్లాక్!

Published: 12-01-2026, 2:30 AM
ప్రభాస్ 'రాజాసాబ్' రెమ్యూనరేషన్ లీక్! ఎవరికి ఎంత ముట్టిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
  • ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీకి రికార్డు స్థాయిలో రూ. 100 కోట్ల పారితోషికం!
  • సంజయ్ దత్ తాత పాత్రలో మెరుపులు, రూ. 5-6 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.
  • హీరోయిన్ల రెమ్యూనరేషన్ వివరాలు: రిద్ధి కుమార్ రూ. 3 కోట్లు, మాళవిక రూ. 2 కోట్లు.
  • బ్రహ్మానందంకు తక్కువ పారితోషికం? కేవలం రూ. 80 లక్షలు మాత్రమే తీసుకున్నారట!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ రెమ్యూనరేషన్ వివరాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటించిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajassab). మారుతి (maruthi)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియాలో ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించగా.. ఇందులో సంజయ్ దత్, యోగిబాబు కీలక పాత్రలో కనిపించారు. ఇక హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మాళవిక మోహనన్,రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ‘ది రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య జనవరి 9 థియేటర్స్‌లోకి వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పలు సీన్స్ తొలగించడం వల్ల అభిమానులు కూడా ఫుల్ ఫైర్ అయ్యారు. దీంతో ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్‌తో పాటు మొత్తం 8 నిమిషాల కంటెంట్‌ను యాడ్ చేశారు. దీంతో ‘ది రాజాసాబ్’ ప్రేక్షకులను బాగానే మెప్పిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ ఈ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఆయన తాత పాత్రలో నటించిన సంజయ్ దత్‌కు రూ.5–6 కోట్లు చెల్లించారట. హీరోయిన్లలో రిద్ధి కుమార్ రూ.3 కోట్లు, మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు పారితోషికంగా అందుకున్నారని టాక్. అనుపమ్ కేర్‌కు రూ.1 కోటి, దర్శకుడు మారుతికి రూ.18 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా, ఈ సినిమాలో అత్యల్ప రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు బ్రహ్మానందం కాగా, ఆయనకు కేవలం రూ.80 లక్షలు మాత్రమే చెల్లించారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి, ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ‘ది రాజాసాబ్’ నిర్మాతలు కొంత నిరాశలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

హీరోయిన్ల పారితోషికం.. ఎవరికి ఎంత?

బ్రహ్మానందం రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

‘ది రాజాసాబ్’ మూవీ రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్. సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.