
📌 Key Points
- ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
- ‘R’ అక్షరం టైటిల్ లో ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ వైరల్ అవుతోంది.
- గతంలో రాఘవేంద్ర, రెబల్, రాధేశ్యామ్ సినిమాలు కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం 450 కోట్ల బడ్జెట్ కేటాయించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల అయింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రభాస్ కు ‘R’ సెంటిమెంట్ ఉందనే చర్చ మొదలైంది.
రాజా సాబ్ సినిమా ఫలితం ఎలా ఉంది?
Prabhas: టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్(Prabhas) నటించిన ది రాజా సాబ్(The Raja Saab) సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ చిత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఈ విధమైనటువంటి సినిమా చేయడంతో మారుతీపై కూడా ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోలేని నేపథ్యంలో ప్రభాస్ కి సంబంధించిన ఒక బ్యాడ్ సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్ నటించిన సినిమా టైటిల్ ‘ R’ అనే అక్షరంతో మొదలైతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గతంలో ప్రభాస్ నటించిన రాఘవేంద్ర, రెబల్, రాధే శ్యామ్ వంటి సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి రాజా సాబ్ సినిమా కూడా ఇలాంటి ఫలితాలను ఎదుర్కొంది అంటూ అభిమానులు ప్రభాస్ బ్యాడ్ సెంటిమెంట్ గురించి చర్చలు జరుపుతున్నారు.
‘R’ సెంటిమెంట్ వెనుక ఉన్న కథేమిటి?
ఈ నేపథ్యంలోనే మరికొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. రెబల్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది, తాజాగా మారుతి డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా రాజా సాబ్ కాదని, “ది రాజా సాబ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పూర్తిగా అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో ఖర్చు పెట్టారని సుమారు 450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని తెలుస్తుంది. హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ ఆకట్టుకున్నప్పటికీ కథ కథనం బాలేకపోవడం సినిమాని సాగదీస్తూ చూపించడంతో ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. ఇక నటనపరంగా ప్రభాస్ అద్భుతంగా నటించారనే చెప్పాలి. ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో టాలీవుడ్ సినిమాల సందడి మొదలైంది. అయితే మొదటి సినిమానే ప్రేక్షకులను నిరాశపరిచింది. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా తదుపరి విడుదల కాబోయే సినిమాలు ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటాయో తెలియాల్సి ఉంది.
ప్రభాస్ తదుపరి చిత్రాలు ఏమిటి?
మొత్తానికి ‘రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ప్రభాస్ రాబోయే సినిమాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.


