
📌 Key Points
- రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో హాట్‌స్టార్ సర్వర్లు డౌన్!
- థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీలో మాత్రం ‘రాజా సాబ్’ కోసం ప్రేక్షకుల ఆసక్తి భారీగా పెరిగింది.
- జియోహాట్‌స్టార్‌లో ‘రిమైండ్ మి’ బటన్‌ను తెగ క్లిక్ చేస్తున్న ఫ్యాన్స్, ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది.
- నెగటివ్ టాక్ తెచ్చుకున్నా, ఓటీటీలో ‘రాజా సాబ్’ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి!
రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక సూపర్ అప్డేట్. హాట్‌స్టార్ సర్వర్లు డౌన్ అవుతున్నాయంటేనే సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఓటీటీలో ప్రభాస్ ప్రభంజనం!
రెబల్ స్టార్ ప్రభాస్ ఓటీటీలోకి అడుగుపెడుతుంటే జియోహాట్‌స్టార్ సర్వర్లు డౌన్ అవుతున్నాయట. మూవీ డిజిటల్ ప్రీమియర్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ ఓటీటీకి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నట్లు చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. దీంతో జియోహాట్‌స్టార్ గంట గంటకూ ఓ పోస్ట్ తో సోషల్ మీడియాలో మూవీ హైప్ ను పెంచేస్తోంది. థియేటర్లలో దారుణంగా బోల్తా పడినా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు మాత్రం ఎంతలా ఎదురు చూస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
‘రాజా సాబ్’ కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్
ది రాజా సాబ్ వచ్చేస్తున్నాడు
దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృత మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే మూవీ కోసం జియోహాట్‌స్టార్ ఏర్పాటు చేసిన ‘రిమైండ్ మి’ బటన్ ను తెగ నొక్కేస్తున్నారట. ఒక్కసారిగా ఈ ప్లాట్‌ఫామ్ పైకి ట్రాఫిక్ పెరిగిపోతోందట. ఇదే విషయాన్ని జియోహాట్‌స్టార్ వెల్లడిస్తూ.. పెరుగుతున్న డిమాండ్ కు తగినట్లుగా తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు ట్వీట్ చేసింది. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
సర్వర్లు అప్‌గ్రేడ్ చేసిన జియోహాట్‌స్టార్
రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ కట్
మరోవైపు భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా నెగటివ్ టాక్ కారణంగా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చిన విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందు మూవీ గురించి గొప్పగా మాట్లాడిన డైరెక్టర్ మారుతికి కూడా ట్రోలింగ్ తప్పలేదు. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత రాజా సాబ్ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ది రాజా సాబ్ ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అభిమానుల ఆత్రుతతో అంచనాలు పెరిగిపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


