|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్: ‘రాజాసాబ్’లో ప్రభాస్ తాత కాదా? టీజర్ లో తాత మారిపోయాడేంటి..

Published: 16-06-2025, 3:47 AM
ప్రభాస్: ‘రాజాసాబ్’లో ప్రభాస్ తాత కాదా? టీజర్ లో తాత మారిపోయాడేంటి..

ప్రభాస్ హారర్ కామెడీ చిత్రం రాజాసాబ్ టీజర్ విడుదలైంది. గ్లింప్స్‌లో ప్రభాస్ తాత పాత్రలో కనిపించగా, టీజర్‌లో సంజయ్ దత్ ఆ పాత్రలో ఉన్నారు. ఈ వ్యత్యాసం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

Key Points

1

రాజాసాబ్ టీజర్ లో సంజయ్ దత్ తాత పాత్రలో కనిపించారు.

2

ప్రభాస్ గతంలో విడుదలైన గ్లింప్స్ లో తాత గెటప్ లో కనిపించారు.

4

సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

రాజాసాబ్ టీజర్ విడుదల

Prabhas : ప్రభాస్ హారర్ కామెడీ సినిమా రాజాసాబ్ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా నేడు టీజర్ రిలీజ్ చేసారు. అయితే ప్రభాస్ తాత గెటప్ లో ఉన్న గ్లింప్స్, పోస్టర్స్ గతంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ మొదటిసారి తాత గెటప్ వేస్తుండటంతో, ప్రభాస్ డ్యూయల్ రోల్ అని సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

కానీ నేడు రిలీజ్ చేసిన టీజర్ లో సంజయ్ దత్ తాత పాత్రలో కనపడ్డాడు. ప్రభాస్ ఒకటే గెటప్ లో కనపడ్డాడు. దీంతో అదేంటి ప్రభాస్ తాత అన్నారుగా, ఇప్పుడు సంజయ్ దత్ తాత పాత్రలో కనిపిస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్ తాత పాత్ర?

అయితే టీజర్ చూస్తుంటే.. సినిమాలో సంజయ్ దత్ తాత పాత్ర. తన ఆస్తిని చనిపోయాక కూడా తానే అనుభవించాలని అనుకుంటాడు. అక్కడికి ప్రభాస్ రావడంతో అతనిలోకి సంజయ్ దత్ పాత్ర ఆత్మ దూరడంతో ప్రభాస్ అలా తాత పాత్రగా బిహేవ్ చేస్తాడేమో అని తెలుస్తుంది.

టీజర్ తో రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్ తాత పాత్ర చేస్తున్నాడని, ఆ తాత ఆత్మ ప్రభాస్ పాత్రలో దూరినపుడు ప్రభాస్ కూడా తాత గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. టీజర్ ఇక్కడ చూసేయండి..

సంజయ్ దత్ పాత్ర ప్రాముఖ్యత

గతంలో రిలీజ్ చేసిన ప్రభాస్ తాత గెటప్ గ్లింప్స్..

చివరగా, రాజాసాబ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంజయ్ దత్ మరియు ప్రభాస్‌ల నటన ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. డిసెంబర్ 5న విడుదలయ్యే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.