|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బండి కొంచెం మెల్లగా.. సాహో, రాజాసాబ్, మిర్చిలోని ప్రభాస్ డైలాగ్ లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వీడియో.. ఇంటర్నెట్ వైరల్

Published: 18-06-2025, 8:37 AM
బండి కొంచెం మెల్లగా.. సాహో, రాజాసాబ్, మిర్చిలోని ప్రభాస్ డైలాగ్ లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వీడియో.. ఇంటర్నెట్ వైరల్

ప్రభాస్ నటించిన సినిమాల డైలాగ్స్‌ను ఉపయోగించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘బండి కొంచెం మెల్లగా’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ వీడియో..

Key Points

1

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రభాస్ డైలాగ్స్‌తో వైరల్ వీడియో

2

సాహో, రాజాసాబ్, మిర్చి సినిమాల డైలాగ్స్ ఉపయోగించి రోడ్డు భద్రతపై అవగాహన

4

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటోంది

ప్రభాస్ డైలాగ్స్‌తో ట్రాఫిక్ పోలీసుల క్రియేటివ్ వీడియో

ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు ‘రాజాసాబ్’. అవును.. ప్రభాస్ నటించిన ఈ లేటెస్ట్ మూవీ టీజర్ హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ టీజర్ లోనూ విజువల్ ఎఫెక్ట్స్, ఒకప్పటిలా డార్లింగ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ రాజాసాబ్ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ క్రేజీగా వాడుకుంది.

రొమాంటిక్ హారర్ కామెడీ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కింది రాజాసాబ్ . ఈ సినిమా టీజర్ జూన్ 16న రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ టీజర్ విడుదల చేశారు. తెలుగులో అయితే రెస్పాన్స్ అదిరిపోయేలా వస్తుంది. ముఖ్యంగా ఇందులోని క్యాచీ డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. ‘బండి కొంచెం మెల్లగా’, ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ లాంటి డైలాగ్ లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఓ వీడియో రూపొందించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

బండి మెల్లగా నడపాలి, హెల్మెట్ ధరించాలి అనే విషయాలను ప్రభాస్ డైలాగ్ ల వీడియోతో సూటిగా చెప్పేసింది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టీమ్. సాహో సినిమాలోని ‘ఇట్స్ షో టైమ్’ అనే ప్రభాస్ డైలాగ్ తో వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే బైక్ మీద రయ్ మంటూ దూసుకెళ్తాడు. అప్పుడే రాజాసాబ్ లోని ‘హలో హలో బండి కొంచెల మెల్లగా’ అనే డైలాగ్ వస్తుంది. అప్పుడు మిర్చిలో బైక్ మీద స్లోగా వచ్చే ప్రభాస్ సీన్ ను యాడ్ చేశారు. ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ అంటూ రాజాసాబ్ డైలాగ్ ను ఇరికించేశారు. చివర్లో మిర్చిలో ప్రభాస్ హెల్మెట్ తీసే సీన్ ను ప్లే చేసి.. ‘హెల్మెట్ ధరించండి, నెమ్మదిగా వెళ్లండి’ అనే క్యాప్షన్ వేశారు.

రోడ్డు భద్రతపై అవగాహన పెంచే ప్రయత్నం

మారుతి డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రెడీ అవుతున్న రాజాసాబ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఎప్పుడో థియేటర్లకు రావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా లేట్ అయిందని రీసెంట్ గా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ ఫిల్మ్ లో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటించారు. తమన్ మ్యూజిక్ అందించారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఓ ట్రీట్ లా ఈ సినిమా ఉండబోతుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి.

ప్రభాస్ అభిమానులకు ఈ వీడియో ఓ వినోదాత్మక అనుభవం అందిస్తూనే, రోడ్డు భద్రత గురించి మంచి సందేశాన్ని అందించింది. ట్రాఫిక్ పోలీసుల ఈ క్రియేటివ్ ప్రయత్నం అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.