|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్ర‌భాస్ ‘ది రాజా సాబ్’ కు బిగ్ టెన్ష‌న్‌: ఓవర్సీస్ లో ఆ హీరో సినిమాకే క్రేజ్?

Published: 23-12-2025, 1:44 AM
ప్ర‌భాస్ 'ది రాజా సాబ్' కు బిగ్ టెన్ష‌న్‌: ఓవర్సీస్ లో ఆ హీరో సినిమాకే క్రేజ్?
  • 2026 సంక్రాంతికి ప్రభాస్ ‘ది రాజా సాబ్’, విజయ్ ‘జన నాయగన్’ ఒకే రోజు రిలీజ్.
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ హారర్ కామెడీ, విజయ్ ‘జన నాయగన్’ పొలిటికల్ యాక్షన్ జానర్ లో వస్తున్నాయి.
  • ఓవర్సీస్ లో ‘జన నాయగన్’ సినిమాకు భారీ ప్రీ-సేల్స్, సాలిడ్ బుకింగ్స్ నమోదవుతున్నాయి.
  • విజయ్ సినిమా పోటీ కారణంగా ‘ది రాజా సాబ్’ విజయావకాశాలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన.

2026 సంక్రాంతికి ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మరియు విజయ్ ‘జన నాయగన్’ సినిమాలు క్లాష్ అవుతున్నాయి. ఓవర్సీస్ లో విజయ్ సినిమాకు భారీ క్రేజ్ వస్తుండటంతో, ప్రభాస్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఇది రాజా సాబ్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సంక్రాంతి రేసులో బడా హీరోల సినిమాలు

2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సారి సరికొత్తగా ఉండనుంది. బడా హీరోల సినిమాలు క్లాష్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అలాగే తమిళ హీరో విజయ్ సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, విజయ్ నటించిన జన నాయగన్ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. ఇందులో విజయ్ సినిమా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా రానుంది. అటు ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ హారర్ కామెడీ జోనర్ లో వస్తోంది.

ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఒకే రోజున ఈ రెండు సినిమాలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ కు కొత్త టెన్షన్ మొదలైందట. ది రాజా సాబ్‌ కంటే విజయ్ జన నాయగన్ సినిమాకు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ సేల్స్ ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ సినిమా తక్కువ‌ సమయంలోనే సాలిడ్ బుకింగ్స్ తో దూసుకుపోతోంద‌ట‌. ఇదే ట్రెండు కొనసాగితే, రాజా సబ్ కు జన నాయగన్ సినిమా గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారట.

ఓవర్సీస్ లో విజయ్ సినిమా హవా

ప్రభాస్ కు కొత్త టెన్షన్ ఎందుకు?

మొత్తంగా, 2026 సంక్రాంతి సినిమా వార్ రసవత్తరంగా మారనుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో విజయ్ సినిమా దూకుడు, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కు సవాల్ విసురుతోంది. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.