|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prabhas: సలార్ అరుదైన రికార్డు.. ఏకంగా 500 రోజులుగా!

Published: 01-07-2025, 11:46 AM
Prabhas: సలార్ అరుదైన రికార్డు.. ఏకంగా 500 రోజులుగా!

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఓటీటీలో 500 రోజులు పూర్తి చేసుకుంది. జియో హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా యొక్క విజయం గురించి తెలుసుకుందాం.

Key Points

1

ప్రభాస్ సలార్ సినిమా ఓటీటీలో 500 రోజులు పూర్తి చేసుకుంది.

2

జియో హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది.

4

సలార్ పార్ట్ 2 త్వరలోనే విడుదల కానుంది.

సలార్ సినిమా యొక్క విజయం

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ప్రభాస్. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్… తన టాలెంట్ నిరూపించుకొని నిలబడ్డాడు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. అయితే ప్రభాస్ 2023 సంవత్సరంలో రిలీజ్ చేసిన సినిమా సలార్.

500 రోజుల ఓటీటీ ప్రయాణం

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ప్రభాస్ హీరోగా చేయగా… శృతిహాసన్ అలాగే శ్రీయ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. పృథ్వీరాజ్ స్పెషల్ రోల్ లో.. అదరగొట్టారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 22, 2023 సంవత్సరంలో రిలీజ్ అయి బంపర్ విజయ్ అని నమోదు చేసుకుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం

అంతేకాదు 270 కోట్లు పెట్టి తీస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. సలార్ పార్ట్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. అయితే సలార్ మొదటి పార్ట్ ఓటీటీ లో రిలీజ్ అయి దాదాపు 500 రోజులు పూర్తయింది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 500 రోజులు అయినప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ మేరకు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మా హీరో సినిమా 500 రోజులైనప్పటికీ.. అదరగొడుతోందని పోస్ట్లు పెట్టి వైరల్ చేస్తున్నారు.

ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా 500 రోజుల వేడుక ఒక గొప్ప విజయం. సినిమా యొక్క కొనసాగింపు చిత్రం త్వరలోనే రానున్నందున అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.