|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ శారీ గిఫ్ట్ వెనుక అసలు కథ! హీరోయిన్ రిద్ది కుమార్ సంచలన కామెంట్స్

Published: 29-12-2025, 1:18 PM
ప్రభాస్ శారీ గిఫ్ట్ వెనుక అసలు కథ! హీరోయిన్ రిద్ది కుమార్ సంచలన కామెంట్స్
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీలో రిద్ది కుమార్ ప్రధాన హీరోయిన్లలో ఒకరు.
  • ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రిద్ది కట్టుకున్న చీర గురించి చర్చ మొదలైంది.
  • తన పుట్టినరోజు గిఫ్ట్‌కు రిటర్న్‌గా ప్రభాస్ చీర ఇచ్చారని రిద్ది కుమార్ వెల్లడించింది.
  • ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా హీరోయిన్ రిద్ది కుమార్ కు ప్రభాస్ ఇచ్చిన శారీ గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ శారీ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను, రిద్ది కుమార్ చేసిన సంచలన కామెంట్స్ ను ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రభాస్ శారీ గిఫ్ట్ వెనుక రహస్యం

ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలోనే హీరోయిన్ రిద్ది కుమార్ , సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కట్టుకున్న చీరపై చర్చ మొదలైంది. ప్రభాస్ గిఫ్ట్ గా గుర్తించాలని ఆమె పేర్కొంది.

తాను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మొదటగా సెట్ కు వెళ్లినట్లు తెలిపారు. ఈ తరుణంలోనే గిఫ్ట్ గా కర్ణుడిపై ఒక పుస్తకం తీసుకువచ్చినట్లు వివరించింది. ఆయన ఆ రోజు రాలేకపోవడంతో, కలవలేకపోయానని తెలిపింది. ఇక దీపావళి పార్టీకి తాను అటెండ్ కాలేకపోయానని వివరించింది. ఆ తర్వాత నేను పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తే, ఆయన తనకు రిటర్న్ గిఫ్ట్ గా చీర ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరో ట్రైలర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

రిద్ది కుమార్ ఫస్ట్ మీట్, గిఫ్ట్ ఎక్స్ఛేంజ్

ది రాజా సాబ్ సినిమా విశేషాలు

ప్రభాస్, రిద్ది కుమార్ మధ్య జరిగిన ఈ గిఫ్ట్ ఎక్స్ఛేంజ్ ఇప్పుడు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఈ వార్త సినిమాకు మరింత పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.