|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పిరిట్: ఒక్క షాట్ కోసం ప్రభాస్ ను రెండు గంటలు ఎండలో నిలబెట్టిన సందీప్ రెడ్డి! ఇంత కష్టమా?

Published: 22-01-2026, 6:35 AM
స్పిరిట్: ఒక్క షాట్ కోసం ప్రభాస్ ను రెండు గంటలు ఎండలో నిలబెట్టిన సందీప్ రెడ్డి! ఇంత కష్టమా?
  • ప్రభాస్ నుండి ఒకే ఎక్స్ప్రెషన్ కోసం రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టిన సందీప్ రెడ్డి వంగా.
  • డిసెంబర్ నుండి స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం, సంక్రాంతికి విరామం.
  • సినిమాలో డాన్ లీ విలన్గా, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
  • 2027 మార్చి 25న 8 భాషల్లో స్పిరిట్ విడుదల కానుంది.

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఒక సన్నివేశంలోని ఎక్స్ప్రెషన్ కోసం ప్రభాస్ను రెండు గంటలపాటు ఎండలో నిలబెట్టారట. ఈ సినిమా 2027 మార్చి 25న విడుదల కానుంది.

ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్ కోసం అంత కష్టమా?

Spirit Movie: సందీప్ రెడ్డి డైరెక్షన్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే .మొదటిసారి సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కాస్త విరామం ఇచ్చిన చిత్ర బృందం త్వరలోనే మరొక షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం డెహ్రాడూన్ వెళ్తున్నట్టు సమాచారం.

ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ తో పాటు హీరోయిన్ కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. 15 రోజులపాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించింది. అయితే కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ పనులను జరుపుకుందని ఇందులో భాగంగా ఒకే ఒక సీన్ షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. ఇలా ఒక్క సీన్ మాత్రమే చేసినప్పటికీ ఆ సీన్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

డిసెంబర్లో ప్రారంభమైన స్పిరిట్ షూటింగ్

ఈ షూటింగ్లో భాగంగా ప్రభాస్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టడానికి సందీప్ రెడ్డి ప్రభాస్ ను రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టారట. ఇలా రెండు గంటల పాటు కృషి చేస్తేనే సందీప్ రెడ్డికి కావాల్సిన పర్ఫెక్ట్ షాట్ వచ్చిందని, సినిమాలో ప్రతి ప్రేమ్ ను ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం సందీప్ రెడ్డి కష్టపడటమే కాకుండా ప్రభాస్ ను కూడా అదే రీతిలో కష్టపెడుతున్నారని తెలుస్తోంది.స్పిరిట్ సినిమాకు సంబంధించి ఈ విషయం బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు కూడా విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

సందీప్ రెడ్డితో సినిమా అంటే మామూలుగా ఉండదని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో డాన్ లీ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే .ఇక ఇందులో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు .ఇక హీరోయిన్ గా త్రిప్తి దిమ్రి (Tripti Dimri)నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని 2027 మార్చి 25వ తేదీ ఎనిమిది భాషలలో విడుదల చేయబోతున్నట్లు సందీప్ రెడ్డి విడుదల తేదీని అధికారికంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా టి సిరీస్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విలన్గా డాన్ లీ, విడుదల ఎప్పుడంటే?

సందీప్ రెడ్డి ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారని ఈ విషయం ద్వారా తెలుస్తోంది. సినిమా కోసం ప్రభాస్ కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.