|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘స్పిరిట్’ నుండి ఊహించని ట్విస్ట్! వంగా మామ మాస్ ప్లాన్ తో ఫ్యాన్స్ కు పూనకాలు!

Published: 25-05-2026, 5:15 AM
ప్రభాస్ 'స్పిరిట్' నుండి ఊహించని ట్విస్ట్! వంగా మామ మాస్ ప్లాన్ తో ఫ్యాన్స్ కు పూనకాలు!
  • ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో రఫ్ & వైల్డ్ పోలీస్ అవతార్‌లో కనిపించనున్నాడు.
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్రిప్తి డిమ్రీతో ఓ స్పెషల్ సాంగ్ షూట్ ప్లాన్.
  • వచ్చే నెలలో భారీ సెట్స్, విఎఫ్ఎక్స్ తో ఈ పాటను చిత్రీకరించనున్నారు.
  • ప్రభాస్ బర్త్ డే పోస్టర్, పోలీస్ లుక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు.

టాలీవుడ్ ప్లాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ బయటికి వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ కొత్త లుక్

Spirit Movie : టాలీవుడ్ ప్లాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఈయన చేతిలో ఇప్పుడు దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.. అందులో క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగారు దర్శకత్వంలో తరికెక్కుతున్న స్పిరిట్ మూవీ కూడా ఒకటి.. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ప్రభాస్ బర్త్డే సందర్భంగా బయటికి వచ్చిన పోస్టరు జనాలకు పూనకాలు తెప్పించింది. ఆ లుక్ లో చూసి అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు.. డైరెక్టర్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలల్లో రొమాన్స్ హైలెట్ గా నిలుస్తుంది. ప్రభాస్ తో కూడా రొమాన్స్ చేయిస్తాడని అందరు అనుకున్నారు. మరి ఇప్పుడు అదిరిపోయే ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వంగా ప్లానేంటో ఒకసారి తెలుసుకుందాం..

వంగా మామ స్పెషల్ సాంగ్ ప్లాన్

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇదిలో ఉన్నదా తాజాగా మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ప్రస్తుతం అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రభాస్- త్రిప్తి డిమ్రీ కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. సాంగ్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మిస్తున్నారని టాక్. బడ్జెట్ తో భారీ సెట్ లో భారీ విఎఫ్ఎక్స్ తో కూడిన ఈ సాంగ్ ఇండియన్ సినిమా చరిత్రలో హైలైట్ గా నిలుస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. వంగ మామ ప్లాన్ అంటే మామూలుగా ఉండదు అంటూ అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా లేదు కదా కామెంట్లు పెడుతున్నారు. మరి ఫ్యాన్ అంచనాలను రెట్టింపు చేసేలా ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకోది రోజులు వెయిట్ చేయాలి.

త్రిప్తి డిమ్రీతో ప్రభాస్ రొమాన్స్?

ఈ మూవీ నుంచి బయటికి వచ్చినా పోస్టరు సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌పై కూడా భారీ చర్చ సాగుతోంది. ఇప్పటివరకు చూడని రఫ్ & వైల్డ్ పోలీస్ అవతార్‌లో ప్రభాస్దర్శనం ఇవ్వనున్నాడు. గతంలో ఏ సినిమాలో కనిపించిన విధంగా ప్రభాస్ ఎనర్జీ ఈ మూవీలో కనిపిస్తుంది అని ఫాన్స్ లో ఆత్రుత మొదలవుతుంది. భారీ ఫిజిక్, స్పెషల్ స్టైలింగ్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ యాక్షన్‌తో ప్రభాస్ మూవీలో సరికొత్తగా కనిపిస్తున్నాడు. కాప్ రోల్ కోసం స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాని గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తగా చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి, యానిమల్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువ అవుతున్నాయి. గతంలో వచ్చిన సినిమాలు రెండు బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడంతో ఈ సినిమా కూడా అంతకుమించి అంచనాలను క్రియేట్ చేసుకుంటుంది అని తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

మొత్తంగా, ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాపై వస్తున్న అప్‌డేట్స్ ఫ్యాన్స్ అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. వంగా మామ ప్లాన్, ప్రభాస్ పోలీస్ లుక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.