
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన మద్దతును తెలియజేశాడు. ‘భారతదేశం ఉన్నతంగా నిలుస్తుంది’ అంటూ ఆయన పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
Key Points
జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది.
ప్రభాస్ ఆపరేషన్ సిందూర్‌పై ‘భారతదేశం ఉన్నతంగా నిలుస్తుంది’ అంటూ పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి
జమ్మూకశ్మీర్(Jammukashmir)లో పహల్గామ్(Pahalgam Attack) వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ భారత్ భగ్గుమంది. దీంతో ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్(Pakisthan)పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సర్వత్రా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది.
ఆపరేషన్ సిందూర్ విజయం
ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)తో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. దీనిపై భారతీయులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రభాస్ ట్వీట్ వైరల్
ఇక ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కూడా ఆపరేషన్ సింధూర్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘భారత దేశం ఉన్నతంగా నిలుస్తుంది’ అని రాసుకొస్తూ ఆపరేషన్ సింధూర్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రభాస్ సహా చాలా మంది ప్రముఖులు భారత సైన్యం ధైర్య సాహసాలను అభినందిస్తున్నారు. దేశభక్తిని ప్రదర్శించిన ప్రభాస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


