|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sekhar Kammula : శివ షూటింగ్ లో నాగార్జున దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నా.. ధనుష్ లైఫ్ లో అలా అడిగింది ఫస్ట్ నేనే..

Published: 15-06-2025, 2:02 PM
Sekhar Kammula : శివ షూటింగ్ లో నాగార్జున దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నా.. ధనుష్ లైఫ్ లో అలా అడిగింది ఫస్ట్ నేనే..

నాగార్జున, ధనుష్ నటించిన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల తన సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు.

Key Points

1

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

2

నాగార్జున, ధనుష్ నటించిన ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది.

4

ధనుష్ ను సినిమా కోసం సన్నగా ఉండమని శేఖర్ కమ్ములే సూచించారని తెలిపారు.

‘కుబేర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

Sekhar Kammula : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఈ సినిమా జూన్ 20 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.

శేఖర్ కమ్ముల – నాగార్జున అనుభవాలు

ఈ ఈవెంట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఇదొక కొత్త సినిమా. ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండరు. ఇది ట్రూ పాన్ ఇండియా సినిమా. తెలుగు – తమిళ్ లో షాట్ చేసాం. ముంబై బ్యాక్ డ్రాప్ కథ. ఇందులో అన్ని జానర్లు ఉంటాయి. మీకు కొత్త అనుభవం ఇస్తుంది. అందరూ ఇది నేను చేసే సినిమాలకు డిఫరెంట్ అంటున్నారు. ఇది అసలు అన్ని సినిమాలకు డిఫరెంట్. బాంబే, బ్యాంకాక్, గోవా, తిరుపతి, రోడ్ల మీద, చెత్త కుప్పల్లో, సముద్రాల దగ్గర షూట్ చేసాము. ఇందులో మెయిన్ వాళ్ళు కాకుండా చాలా మంది కొత్త వాళ్లే చేసారు. శివ షూటింగ్ లో నాగార్జున – అమల గారి మీద షూట్ చేస్తుంటే సంజీవ్ రెడ్డి నగర్ లో నేను వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నాగార్జున గారు రాత్రి షూటింగ్స్ చేయరు, కానీ ఈ సినిమాలో నా కోసం చేసారు. ఆయన ఆదివారాలు షూటింగ్ చేయరు, నా కోసం చేసారు. సినిమాలో చాలా చేసారు యాక్షన్ సీన్స్. నేను చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశాను. కానీ లోపల, బయట ఒకేలా ఉండే హీరోయిన్ రష్మికనే. చెత్తకుప్పల్లో కూడా వర్క్ చేసింది. ధనుష్ బిచ్చగాడు క్యారెక్టర్ బాగా చేసారు. మొదటి రోజు నాగార్జున గుర్తుపట్టలేదు. ధనుష్ లైఫ్ లో ఆయన్ని ఫస్ట్ సన్నబడమని అడిగింది నేనే అని చెప్పారు. ఆయన సన్నగా ఉంటారు కానీ సినిమా కోసం ఇంకా సన్నబడ్డాడు కూడా అని అన్నారు.

ధనుష్ పాత్ర గురించి శేఖర్ కమ్ముల వ్యాఖ్యలు

కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల, నాగార్జున, ధనుష్ ల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణలు సినిమాపై అంచనాలను పెంచాయి. జూన్ 20న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.