
📌 Key Points
- కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ప్రభాస్ భారీ ప్రమోషన్: పాన్ ఇండియా స్టార్ సపోర్ట్‌తో సినిమాకు ఊహించని బూస్ట్!
- హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసి నటన అద్భుతంగా ఉందని ప్రభాస్ ప్రశంసలు కురిపించారు.
- లివింగ్ రిలేషన్ షిప్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాను మరో నాలుగుసార్లు చూస్తానన్న ప్రభాస్.
- యువి క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ప్రభాస్ మొదటి నుండి మద్దతు తెలుపుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక చిన్న సినిమాకు మద్దతు తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను ప్రభాస్ తెగ మెచ్చుకోవడంతో ఒక్కసారిగా సినిమా హాట్ టాపిక్ అయింది.
ప్రభాస్ ప్రమోషన్: కపుల్ ఫ్రెండ్లీకి ఊహించని మద్దతు
బాహుబలి ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఉన్నారు. ప్రభాస్‌కి ఒక సినిమా నచ్చిందంటే అతను అభిమానులకు నచ్చకుండా ఎలా ఉంటుంది? అందుకే ప్రభాస్ తనకు నచ్చిన ఒక సినిమా గురించి ప్రమోషన్ చేస్తున్నారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఇది ప్రస్తుతం థియేటర్లలో ఉంది. మొదట్లో సినిమా బాగుందంటూ టాక్ వచ్చింది. ముఖ్యంగా వాలెంటైన్స్ డే కు సైలెంట్ గా విడుదలైంది ఈ సినిమా. వీకెండ్ వచ్చేసరికి థియేటర్లకు ప్రేక్షకులకు రావడమే మానేశారు. సినిమా బాగుంది, కథ బాగుంది, రివ్యూలు పాజిటివ్గా వచ్చాయి… కానీ ప్రేక్షకులకు మాత్రం సినిమాకు రావట్లేదు. అందుకే ప్రభాస్ రంగంలోకి దిగి తన వంతు సాయం చేయడం మొదలుపెట్టారు.
యువి క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు ప్రభాస్ మొదటి నుంచి మద్దతుగానే ఉన్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సినిమా కోసం మొదటిసారిగా రియాక్ట్ అయ్యారు. అప్పుడే ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేశారు. ఇదే ఇంటర్వ్యూ ను ముందే చేసి ఉంటే ఓపెనింగ్స్ పెరిగేవేమో.. అయినా కూడా బిజీగా ఉండే ప్రభాస్ ఈ చిన్న సినిమా కోసం ఇంత సమయం కేటాయించడం గ్రేట్ అని అభిమానులు ముచ్చట పడిపోతున్నారు.
హీరో హీరోయిన్ల నటనపై ప్రభాస్ ప్రశంసలు
ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. అలాంటి వ్యక్తి తాను ఇప్పటికే కపుల్ ఫ్రెండ్లీ చూశానని, ఆ సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. అంతేకాదు మరో నాలుగు సార్లు చూడడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా అన్నారు. లివింగ్ రిలేషన్ షిప్ అనే వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ప్రభాస్ తనకు ఆ సినిమాలో హీరోగా చేసిన సంతోష శోభన్ నటన చాలా నచ్చిందని చెప్పారు. హీరోయిన్ మానస వారణాసి కూడా యాక్టింగ్ తో మెప్పించిందని, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చిందని మెచ్చుకున్నారు. సంతోష్ శోభన్ క్యారెక్టర్ ను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారని, అందుకే ఆ క్యారెక్టర్ మనతో బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు.
మరో నాలుగుసార్లు చూస్తానన్న ప్రభాస్: కారణం ఇదే!
హీరో హీరోయిన్లు ఇద్దరు చక్కగా నటించారని.. వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కూడా తనకు ఎంతో నచ్చుతుందని చెప్పారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ టీంకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో ఇక ప్రేక్షకులు కూడా థియేటర్ బాట పడతారని ఆశిస్తున్నారు. ఆ సినిమా నిర్మాతలు ప్రభాస్ ఇచ్చిన హైప్ ఆ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడటంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారు. మరి ఈ సినిమాకు ప్రభాస్ ఇచ్చిన హైప్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


