|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘ది రాజా సాబ్‌’ ఫస్ట్ రివ్యూ: హైలైట్స్ ఇవే! బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయడం ఖాయం?

Published: 06-01-2026, 1:00 AM
ప్రభాస్ 'ది రాజా సాబ్‌' ఫస్ట్ రివ్యూ: హైలైట్స్ ఇవే! బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయడం ఖాయం?
  • ‘ది రాజా సాబ్‌’ ఫాంటసీ హర్రర్ కామెడీగా తెరకెక్కింది, మారుతి దర్శకత్వం.
  • ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు ‘పైసా వసూల్’ మూవీగా మొదటి రివ్యూ ఇచ్చారు.
  • ప్రభాస్ నటన, సంజయ్ దత్ పాత్ర, చివరి 30 నిమిషాలు సినిమాకు హైలైట్స్.
  • సినిమా నిడివి 189 నిమిషాలు, U/A సర్టిఫికేట్ పొంది సంక్రాంతికి సిద్ధంగా ఉంది.

ప్రభాస్‌ ‘ది రాజా సాబ్‌’ సంక్రాంతికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ ఓవర్సీస్ క్రిటిక్ ఉమైర్ సందు సినిమాకు పాజిటివ్ టాక్ ఇవ్వడంతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమనే అంచనాలున్నాయి.

ఉమైర్ సందు రివ్యూ: ‘రాజా సాబ్‌’ పైసా వసూల్!

ప్రభాస్‌ ఏడాది గ్యాప్‌ తర్వాత వస్తోన్న మూవీ `ది రాజా సాబ్‌`. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్‌తో ఫాంటసీ హర్రర్‌ కామెడీగా దీన్ని రూపొందించారు దర్శకుడు మారుతి. ప్రభాస్‌ నటించిన తొలి హర్రర్‌ కామెడీ చిత్రమిది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. దీనికి పాజిటివ్‌ టాక్ రావడం విశేషం. ప్రముఖ ఓవర్సీస్‌ క్రిటిక్‌ గా భావించే ఉమైర్‌ సందు తన ఫస్ట్ రివ్యూని ఇచ్చారు. ఇది పైసా వసూల్‌ మూవీ అని ప్రకటించారు. పైసా వసూల్‌ మాస్‌ ఎంటర్టైనర్‌ మూవీ అని చెప్పారు.

ప్రభాస్ ‘ది రాజా సాబ్‌’ లో హైలైట్స్ ఇవే

ప్రభాస్‌ భారీ బ్యాంగ్‌తో బ్యాక్‌ అవుతున్నారని, అతను తన నటనతో, తన ప్రజెన్స్ తో అందరిని ఆకట్టుకుంటారని, ఆయన పాత్రనే సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్‌ అని చెప్పారు. అతని నటన చాలా క్రేజీగా ఉందని, గతంలో ఎప్పుడూ ఇలా చూసి ఉండరని చెప్పాడు. సంజయ్‌ దత్‌ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ప్రభాస్‌, సంజయ్‌ దత్‌కి సంబంధించిన సీన్లు అదిరిపోయేలా ఉంటాయని, క్లాప్స్ కొట్టేలా ఉంటాయని చెప్పారు. చివరి 30 నిమిషాలు, క్లైమాక్స్ సినిమాకి పెద్ద అసెట్‌` అన్నారు.

సినిమాలో కొన్ని బోరింగ్‌ మూమెంట్స్ ఉంటాయని, కానీ ఓవరాల్‌గా చూస్తే సంక్రాంతికి ఫెస్టివల్‌ వైబ్‌ని తీసుకొచ్చే మూవీ అవుతుందన్నారు. నిధి అగర్వాల్‌ చాలా క్యూట్‌గా ఉంటుందని, పాటలు అలరించేలా ఉంటాయన్నారు. దర్శకత్వం, వీఎఫ్‌ఎక్స్ వేరే లెవల్‌ అని తెలిపారు. హర్రర్‌ రైడ్‌ని ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని చెప్పారు. ఉమైర్‌ సందు చాలా రేర్‌గా ఇలాంటి పాజిటివ్‌ రివ్యూలు ఇస్తారు. ఈ మూవీకి ఆయన పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాడంటే మూవీ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

బాక్సాఫీస్‌పై ‘రాజా సాబ్‌’ ప్రభావం ఎలా ఉంటుంది?

`ది రాజాసాబ్‌` సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సినిమా నిడివి మూడు గంటల ఐదు నిమిషాలు ఉంటుందట(189 నిమిషాలు). యూ బై ఏ సర్టిఫికేట్‌ పొందింది. ఇక సినిమా గురించి దర్శకుడు మారుతి చెబుతూ, సినిమాలో 20 శాతం ఫాంటసీ ఉంటుందని, 20 శాతం ఎమోషన్స్ ఉంటాయని, 50 శాతం కామెడీ ఉంటుందని చెప్పారు. మొత్తంగా మంచి హర్రర్‌ కామెడీ మూవీని రూపొందించారని అర్థమవుతుంది. ప్రభాస్‌ రేంజ్‌కి ఈ మూవీ వర్కౌట్‌ అయితే బాక్సాఫీసు షేక్‌ కావడం పక్కా.

‘ది రాజా సాబ్‌’కు ఉమైర్ సందు నుండి బలమైన సానుకూల రివ్యూ రావడంతో, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే సత్తా ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ అభిమానులకు ఇది పండుగ కానుకగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.