|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prabhudeva : ప్రభుదేవా లవ్ స్టోరీ తెలుసా..? ట్రీట్మెంట్ చేద్దామని వస్తే.. డాక్టర్ తో..

Published: 29-09-2025, 11:45 AM
Prabhudeva : ప్రభుదేవా లవ్ స్టోరీ తెలుసా..? ట్రీట్మెంట్ చేద్దామని వస్తే.. డాక్టర్ తో..

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న షోలో తన రెండవ భార్య, డాక్టర్ హిమనీ సింగ్‌తో ప్రేమకథను పంచుకున్నారు. ట్రీట్‌మెంట్ కోసం వెళ్ళిన ఆయనకు డాక్టర్‌తో ఎలా ప్రేమ చిగురించిందో ఈ కథనంలో వివరాలు తెలుసుకోండి.

Key Points

1

ప్రభుదేవా తన రెండవ భార్య హిమనీ సింగ్‌తో ప్రేమకథను ఒక టాక్ షోలో పంచుకున్నారు.

2

చేతికి గాయంతో ఫిజియోథెరపీకి వెళ్ళగా డాక్టర్ హిమనీ సింగ్ తో పరిచయం ప్రేమకు దారితీసింది.

4

ప్రభుదేవా గతంలో రమాలత్, నయనతారలతో సంబంధాలు కలిగి ఉన్నారు, ఆ తర్వాత విడిపోయారు.

ప్రభుదేవా ప్రేమకథ బయటపెట్టిన వైనం

Prabhudeva : ఇండియన్ మైకేల్ జాక్సన్ అనిపించుకునేలా ప్రభుదేవా తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం డ్యాన్స్ మాస్టర్ గా మాత్రమే కాకుండా హీరోగా, నటుడుగా, డైరెక్టర్ గా, నిర్మాతగా కుడా సక్సెస్ అయ్యాడు. ఇండియాలో ఉన్న టాప్ స్టార్ హీరోలందరితో ప్రభుదేవా కలిసి పనిచేసాడు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ అన్ని పరిశ్రమలలో బిజీగా ఉన్నాడు.(Prabhudeva)

తాజాగా ప్రభుదేవా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయము నిశ్చయమ్మురా షోకి రాగా పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు.

Also See : Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ‘హైలెస్సో’ మూవీ ఓపెనింగ్.. ఫొటోలు..

హిమనీ సింగ్‌తో పరిచయం, పెళ్లి

ప్రభుదేవా 1995లో రమాలత్ అనే మహిళను వివాహం చేసుకోగా 2011లో వీరు విడిపోయారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుదేవా – నయనతార రిలేషన్ లో ఉన్నారంటూ ఆరోపణలు చేస్తూ రమాలత్ మీడియా ముందుకు కూడా వచ్చింది. కానీ తర్వాత నయనతార – ప్రభుదేవా కూడా విడిపోయారు. ఆ తర్వాత ప్రభుదేవా హిమనీ సింగ్ అనే డాక్టర్ ని 2020 లో పెళ్లి చేసుకున్నాడు.

ఈ టాక్ షోలో ప్రభుదేవా హిమనీతో ఉన్న లవ్ స్టోరీ తెలిపాడు. ప్రభుదేవా మాట్లాడుతూ.. బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నప్పుడు చేతికి గాయం అయింది. దీంతో ఫిజియోథెరపీ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు హిమనీ సింగ్ అనే డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేసింది. అలా పరిచయం అయి ప్రేమలో పడ్డాము. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పాప సియా కూడా ఉంది. ఆమె నా జీవితంలోకి వచ్చినా ఇంకా ఆ నొప్పి మాత్రం తగ్గలేదు. ఇప్పటికి తనకు చెప్తాను ఆ నొప్పికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి నా లైఫ్ లోకి వచ్చావు కానీ ఆ నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు అంటాను అని తెలిపారు.

ప్రభుదేవా గత సంబంధాలు, కుటుంబం

ప్రభుదేవా సెకండ్ వైఫ్ హిమనీ సింగ్ బయట ఎక్కడ కనపడదు. ఒక షోలో ప్రభుదేవా వెళ్లగా అక్కడ హిమనీ తన భర్త గురించి మాట్లాడిన ఓ వీడియో ప్లే చేసారు. మరోసారి తిరుమలలో కనిపించింది. ఆ తర్వాత ప్రభుదేవా భార్య హిమనీ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగానే ఉంటుంది. ఆమె ముంబైలో డాక్టర్ గా చేస్తుంది. ప్రభుదేవా ముంబైలో నివాసం ఉంటూనే తన వర్క్ మీద అన్ని పరిశ్రమలకు తిరుగుతున్నాడు.

ప్రభుదేవా తన ప్రేమకథను పంచుకోవడం ద్వారా అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచే హిమనీ సింగ్‌తో ఆయన బంధం ప్రత్యేకమైనది. తన వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా, ప్రభుదేవా కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తారో ఈ కథనం తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.