|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టైటిల్ వెనుక ఇంత కథ ఉందా? LIC పేరుకు ప్రదీప్ సినిమా భారీ మూల్యం! దిమ్మతిరిగే ట్విస్ట్!

Published: 15-04-2026, 7:05 AM
టైటిల్ వెనుక ఇంత కథ ఉందా? LIC పేరుకు ప్రదీప్ సినిమా భారీ మూల్యం! దిమ్మతిరిగే ట్విస్ట్!
  • ప్రదీప్, కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ఏప్రిల్ 10న విడుదలైంది.
  • సినిమా టైటిల్ కోసం LICని సంప్రదిస్తే రూ.112 కోట్లు చెల్లించమని కోరడంతో LIKగా మార్చారు.
  • దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్లలో భాగంగా వెల్లడించారు.
  • కృతి శెట్టి తమిళంలో కూడా నిరాశను ఎదుర్కొంటుందని సమాచారం.

ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా టైటిల్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తమ సినిమా టైటిల్ కోసం LIC కంపెనీ ఏకంగా 112 కోట్ల రూపాయలు అడిగినట్లు దర్శకుడు విగ్నేష్ శివన్ తెలిపారు.

LIK టైటిల్ వెనుక అసలు కథ

LIK Movie: ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు ప్రముఖ నటి నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకుడిగా వ్యవహరించగా నయనతార నిర్మాతగా కొనసాగారు.

ప్రదీప్ రంగనాథన్ సినిమా అంటే అందరికీ ఎన్నో మంచి అంచనాలే ఉంటాయి కానీ ఈ సినిమా విడుదలకు ముందు అదే స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న విధంగా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక నిరాశను మిగిల్చింది.. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ విగ్నేష్ ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే LIC అని టైటిల్ పెట్టుకోవాలి కాకపోతే ఈ సినిమాకు LIK అని పెట్టడానికి గల కారణాన్ని తెలియజేశారు.

రూ.112 కోట్లు డిమాండ్ చేసిన LIC

నిజానికి తాము తమ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాకు LIC అనే టైటిల్ పెట్టాలని భావించాము ఇలా ఈ టైటిల్ పెట్టడం కోసం ఎల్ఐసి కంపెనీని తాము సంప్రదించగా వారి కంపెనీ పేరు వాడుకోవడానికి ఏకంగా 112 కోట్ల రూపాయలు కట్టమని తెలిపారు. కేవలం పేరు వాడుకోవడానికి ఈ స్థాయిలో డబ్బు చెల్లించమని అడగడంతో టైటిల్ విషయంలో తమ నిర్ణయం మార్చుకొని LIC నుంచి LIK అని పెట్టుకున్నాము అంటూ విగ్నేష్ శివన్ ఈ సందర్భంగా టైటిల్ మార్చడం వెనుక గల కారణాలను తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎల్ఐసి పేరు వాడుకోవడం కోసమే వందల కోట్లు డబ్బు చెల్లించడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఆశ్చర్యపోతున్నారు.

కృతి శెట్టికి తమిళంలోనూ చేదు అనుభవమే..

కృతి శెట్టికి తమిళంలోనూ నిరాశేనా?

ఇక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా విషయానికి వస్తే 2040లో ప్రేమలు ఎలా ఉంటాయనే విషయంపై ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని తెలుస్తోంది. ఇందులో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించారు. తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ప్రతి సినిమా ద్వారా నిరాశను ఎదుర్కొంటున్న కృతి శెట్టి తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అక్కడికి వెళ్లారు అయితే తమిళంలో ఈమె ఇప్పటికే అన్నగారు వస్తారు, లైక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అక్కడ కూడా నిరాశ ఎదురైందని చెప్పాలి.

చివరిగా, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ టైటిల్ వెనుక ఉన్న ఈ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, టైటిల్ వివాదం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.